విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రజలను, వైఎస్ అభిమానులను నమ్మించి మోసం చేయటమే కాకుండా నమ్మి నడిచిన తమ లాంటి వారిని ఆర్థికంగా కూడా నష్టపోయామని తెలంగాణాకు చెందిన కొండగల్ ఇన్‌ఛార్జి, మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ తమ్మలి బాలరాజు ఆరోపించారు. ఆదివారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ హయాంలో పేద, బడుగు వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారని ఆయన మరణం అనంతరం శూన్యంగా మారి పేద ప్రజలు అనేక రకాలుగా నష్టపోతూ అనేక ఇబ్బందులు పడుతున్నారని అటువంటి సమయంలో వైఎస్ షర్మిల తాను వైఎస్ కూతురిని ఆయన లేని లోటు తీర్చి ప్రజలకు అండగా ఉంటానని పార్టీ పెట్టడంతో తాము కుడా పార్టీలో చేరటం జరిగిందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించటంతో పాటు ఆర్ధికంగా కూడా తాము తోడ్పాటు అందించి పార్టీ ఎదుగుదలకు కృషి చేశామన్నారు. తెలంగాణ ఎన్నికల ముందు కూడా 3 లక్షలు పార్టీకి ఫండ్ ఇచ్చాను అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చిందన్నారు. షర్మిల రాజకీయం కాదు వ్యాపారం చేస్తుందన్నారు. ఆమె ఎక్కడైనా అంబేడ్కర్‌కి ఒక్క దండ కూడా వేయలేదు. సొంత అన్నకే రాఖీ కట్ట లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. షర్మిల పార్టీ పెట్టాక 60 మంది చనిపోయారు. ఒక్కరికి కూడా న్యాయం చేయలేదన్నారు. తమ నియోజకవర్గంలో 15 లక్షలు ఖర్చు పెట్టి షర్మిలకి స్వాగతం పలికింది. ఏపిలో పర్యటిస్తున్న షర్మిల ఎక్కడైన రాజశేఖర్‌రెడ్డి ఫోటో పెట్టిందా అని ప్రశ్నించారు. అవసరమైతే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకొంటుంది కానీ వైఎస్ ఫోటో మాత్ర పెట్టడానికి మనస్సు రావటం లేదన్నారు. ఆనాడు కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడిపోవాలని కోరింది. మరొక చోట కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇవ్వాలని సూచిందన్నారు. ఆనాడు షర్మిలతో వెళ్తామని సజ్జలని అడిగితే వెళ్ళమని చెప్పారు. అందుకే తాము వెళ్ళామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ తాము పోటీ చేస్తాం. మాకు పార్టీతో సంబంధం లేదు అఖరుకు వైసీపీ నుండి పోటీ చేసిన పోటీ చేస్తాం అన్నారు. వికరాబాద్ పార్టీ నాయకురాలు ఇ.సుధారాణి మాట్లాడుతూ పార్టీ కోసం అప్పులు చేసి నష్టపోయాం అన్నారు. తెలంగాణ కోసం పనిచేస్తా అని చెప్పింది. ఈ రోజు తాము ఏపికి వచ్చింది తమలాగ ఇక్కడ ప్రజలు నష్టపోకూడదని ఉద్దేశంతో వొచ్చామన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …