విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఇండియన్స్, ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, శిరీష క్లినిక్ ప్రోత్సాహంతో కళనీ, కళా సంస్కృతిని పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో విజయవాడకి చెందిన ప్రముఖ సీనియర్ చిత్రకారులు, చిత్రకళా తపస్వి, స్వర్గీయ వేముల కామేశ్వరరావు శత వసంతాల వేడుక సందర్భంగా నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనను యువజన సంక్షేమశాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యు.శ్రీనివాసరావు లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేముల కామేశ్వరరావు కుటుంబ సభ్యులను ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంస్థ ఘనంగా సత్కరించారు. అనంతరం నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో దాదాపు 40 విద్యాసంస్థల నుంచి 600 పైగా చిన్నారులు పాల్గొన్నారు. బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారతీయ భారతి ఫైన్ ఆర్ట్ స్కూల్ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. యంగ్ ఇండియన్స్ సంస్థ అమరావతి ఛైర్ యువ బాలకృష్ణ చిట్టినేని, మనీషా డెంటల్ కేర్ డాక్టర్ సమీర, ఇన్నర్ వీల్ క్లబ్ మిడ్ టౌన్ సెక్రటరీ సరస్వతి, మిసెస్ ఐకానిక్ మోడల్ 2023 గీత, అవేరా ఎలక్ట్రానిక్ సంస్థ కో ఫౌండర్ చాందినీ చందన వేముల కామేశ్వరరావు మనుమరాలు కుమారి సాయి ప్రజ్ఞ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రకళా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రసంశా పత్రాలు జ్ఞాపికలు అందజేసారు. ఈ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడు సునీల్‌కుమార్ అనుమకొండ, ఉపాధ్యక్షుడు గిరిధర్ అరసవల్లి, జనరల్ సెక్రటరీ స్పూర్తి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎస్.పి.మల్లిక్, ఉమెన్ వింగ్ ఇన్చార్జి సంధ్యారాణి, జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు పర్యవేక్షించగా వర్కింగ్ కమిటీ మెంబెర్స్ చిత్రం సుధీర్, స్వాతి పూర్ణిమ, సౌజన్య శ్రావణ్‌కుమార్, ప్రియాంక, చంద్రికలతో పాటు పలువురు సీనియర్ చిత్రకారుల యువ చిత్రకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …