విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోనసీమ జిల్లాలో వివిధ గ్రామాల రాకపోకలకు సంబంధించి అభివృద్ధి పనులకు పెద్దపీట వేయడం జరుగు తుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం స్థానిక మండల పరిధిలోని మామిడి కుదురు- అప్పనపల్లి మార్గం మధ్యలో కొర్లకుంట వద్ద శిథిలా వస్థకు చేరిన వంతెన (బ్రిడ్జ్) ఆయన జిల్లా పర్యటనలో గుర్తించడంతో పాటు సుమారు నాలుగు గ్రామాలకు రాకపో కలకు, రవాణా సౌకర్యాల తీవ్ర అంత రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మానవతా దృక్పథంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తీసుకున్న ప్రత్యేక చొరవ స్వయం పరపతితో సుమారు గా రూ .54 లక్షల మేర నిధులు సమకూర్చి బ్రిడ్జి నిర్మించడం జరిగింది. ఈ యొక్క బ్రిడ్జ్ కు గ్రామస్తులు హిమాన్షు శుక్లా వారిదిగా నామకరణం చేశారు అదేవిధంగా వంతెన నిర్మాణం మూలంగా పెదపట్నం పెదపట్నంలంక, అప్పనపల్లి దొడ్డవరం, గ్రామాలకు వరద ముంపు బెడద పూర్తిగా తప్పింది. ఈ యొక్క వంతెనను జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా సోమవారం ప్రారంభిం చుకోవడం జరిగింది. అదేవిధంగా మండల పరిషత్ నిధుల నుండి సుమారుగా రూ.5.20 లక్షలు కేటాయించి ఈ వంతెన కి ఇరువైపులా సి సి రోడ్లను నిర్మించి. ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ నాలుగు గ్రామాలకు చెందిన వారు రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇక్కట్లను స్వయంగా గుర్తించి దూర దృష్టితో ఆలోచన చేసి రాకపోకలు వెంటనే పునరుద్దరించాలనే సత్సం కల్పంతో స్వయం పలుకుబడి పరపతితో నిధులు సేకరించి వంతెన నిర్మాణం పూర్తి చేయడం అదేవిధంగా ఇరు వైపులా సి సి రోడ్ నిర్మించు కోవడం ఎంతో ఆనంద దాయకoగా ఉందన్నారు.. ఈ కార్యక్రమం లో శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు జడ్పిటిసి అంజిబాబు అయినవిల్లి జడ్పిటిసి గన్నవరపు శ్రీనివాసరావు రాజోలు జడ్పిటిసి మరియు ఏపీఐసిసి సభ్యులు మట్టా శైలజ, సఖినేటిపల్లి జడ్పిటిసి టి అన్నపూర్ణ ఎంపీపీ కే వనజ కుమార్ ఎంపీటీసీ కడలి పద్మ సర్పంచ్ లు జి దుర్గా నాగేశ్వరరావు గడ్డం మంగ లక్ష్మి వెంకటేశ్వరరావు బొంతు నీలిమ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …