-క్షయ బాధితుల పట్ల వివక్ష వద్దు
-“స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” కార్యక్రమాలు
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు క్షయ వ్యాధి నిర్మూలన “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు.
స్థానిక కలెక్టరేట్ లో “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” గొడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను క్షయ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చెయ్యలన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి నీ పురస్కరించుకుని జనవరి 30 న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. క్షయ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల వారిని దూరంగా ఉంచడం జరుగుతోందని అన్నారు. ఏ ఏ శాఖలు ఏ విధమైన బాధ్యతలు చేపట్టవలసి ఉంటుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆమేరకు ప్రచార చేపట్టాలని , సంబంధిత శాఖలు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జీ. నరసింహులు, టూరిజం ఆర్డి వి. స్వామీ నాయుడు, కే ఆర్ ఆర్ డి ఏస్టిటి కృష్ణ నాయక్, జిల్లా లెప్రసి అధికారి డా ఎన్. వసుంధర, డి ఎమ్ హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు .