రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ట్రెజరీ స్ట్రాంగ్ రూం లో ఉన్న వివిధ కార్యాలయాలకు చెందిన 34 ఆర్టికల్స్ ఉపసంహరించు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, స్ట్రాంగ్ రూం పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులకు ఆమేరకు జేసీ సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దీర్ఘ కాలికంగా జిల్లా పరిధిలోని 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన వివరాలు తెలియ చెయ్యడం జరిగిందన్నారు. మొత్తం 49 ఆర్టికల్స్ ట్రెజరీ స్ట్రాంగ్ రూం నుంచి ఉపసంహరించాల్సి ఉండగా 15 ఆర్టికల్స్ ఆయా శాఖలు ఉపసంహరించు కున్నట్లు తేజ్ భరత్ తెలిపారు. ఇంకా ఇరిగేషన్ 18, పోలీస్ 5 , పంచాయతీ రాజ్ 2 , రెవెన్యూ 6 , ఆర్ అండ్ బి, దేవాదాయ జుడిషియల్ శాఖలకు చెందిన ఇంకా 34 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవడం జరగాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు , సహాయ ట్రెజరీ అధికారి కె. వినోద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.