Breaking News

నేడు స్పందనలో వచ్చిన అర్జీలు.186

-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో వచ్చిన అర్జీలపై నిర్ణీత కాలవ్యవధిలోగా చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత అధికారులకు సూచించారు.

సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ నరసింహులు, టూరిజం ఈడి వి స్వామీ నాయుడు, ఎస్ డి సి కృష్ణ నాయక్ లతో కలిసి కలెక్టర్ మాధవీలత అర్జీలు పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కే .మాధవీ లత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి కి ఆమేరకు సేవలు అందించడం లో జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు.. ఈరోజు స్పందనలో 186 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించామన్నారు. ఇందులో ఆన్లైన్లో 164 , ఆఫ్ లైన్ లో 22 అర్జీలు ఉన్నాయని తెలిపారు. వాటిలో రెవెన్యూ 71 , పంచాయతి రాజ్ 33 , పోలీస్ 15 , విద్యుత్ 12 తదితర శాఖల అర్జీలు ఉన్నట్లు తెలిపారు.

స్పందనలో వచ్చిన కొన్ని అర్జీలు.:-
.పెరవలి మండలం కరకపర్రు కి చెందిన వృద్ధాప్య పింఛన్ కొరకు ధరఖాస్తు చేసుకున్నారు. పెరవలి ఎంపీడీఓ తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతిపాదనలు చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు .

కొలమూరు గ్రామానికి చెందిన తొమ్మిది గ్రూప్ సభ్యులు విజయ, గౌతమి, గ్రేస్, స్వరూప, భారతి, శ్రీ కన్య తదితర గ్రూపులకు అక్టోబర్ నెలలో స్వయం సహాయక సంఘాలు తదుపరి రుణానికి అర్హత కలిగి ఉన్నా కాతేరు బ్యాంక్ అఫ్ బరోడా వారు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. వెంటనే కలెక్టర్ ఎల్ డి ఎం ను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నిడదవోలు మండలం కలవచేర్ల కి చెందిన ఎలక నిర్మల కుమారి ఇంటి నివాస స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు.  అర్హత మేరకు అర్జీ పరిశీలించి నివేదిక అంద చేయ్యాలని స్పష్టం చేశారు.

గోపాలపురం మండలం బుచ్చయ్య పాలెం గ్రామానికి చెందిన స్థలానికి చెందిన డ్రైనేజీ సమస్య పై కలెక్టర్ కి ఫిర్యాదు చెయ్యగా. ఎంపీడీఓ జిల్లా స్థాయి కమిటీ ఉత్తర్వులకు లోబడి సమస్య పరిష్కారం చెయ్యాలని కలెక్టర్ ఆదేశించారు.

బిక్కవోలు మండలం అరికిరేవుల కి చెందిన కే ఎస్ ఎస్ వి వి సత్యనారాయణ తనకు దివ్యాంగుల పెన్షన్ పథకం వర్తింపు చెయ్యాలని, 64 శాతం వైకల్యం కలిగి ఉన్నట్లు అర్జి అందచేశారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి.నరశింహులు, పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు వి.స్వామి నాయుడు, డియంహెచ్ఓ డా.కె.వేంకటేశ్వర రావు, డిసిహెచ్ఒ డా. ఎమ్. సనత్ కుమారి, ఎస్ ఈ పిఆర్ ఏ బీ వీ ప్రసాద్, సీపీఓ ఎల్. అప్పల కొండ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కె. విజయ కుమారి,డి ఈఓ ఎస్. అబ్రహం, డి ఎల్ డిఓ పి. వీణాదేవి, సివిల్ సప్లై జిల్లామేనేజరు వి.నాగార్జున రెడ్డి, ఎస్ ఈ పి ఆర్ ఎ బి వి ప్రసాద్, ఎస్ ఈ ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, పలువురు జిల్లా శాఖా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *