-విశ్వవిద్యాలయంలో విద్యాపరమైన అతిపెద్ద పండుగ స్నాతకోత్సవం
-ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
-కలెక్టర్ మాధవీలత
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
నన్నయ యూనివర్సిటీ 13 , 14 , 15 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ను అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం గైట్ కళాశాల, నన్నయ్య యూనివర్సిటీ లో అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.పద్మరాజు , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అదనపు ఎస్పీ రాజశేఖర్ తో కలిసి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సంధర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో తొలిసారి రాష్ట్ర గవర్నర్ పర్యటన కొసం రానున్న దృష్ట్యా ప్రోటోకాల్ అనుసరించి అందరూ పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13, 14 మరియు 15వ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 31వ మధ్యాహ్నం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి సంబంధించిన నన్నయ విశ్వవిద్యాలయంలో 2019-20, 2020-21, 2021-22 విద్యాసంవత్సరానికి చెందిన పిహెచ్.డీ, పీజీ, పీజీ డిప్లొమా, యూజీ అండ్ పీజీ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన వారికి పట్టాలు అందిస్తామన్నారు. గవర్నర్ చేతుల మీదుగా పిహెచ్.డి 12, గోల్డ్ మెడల్స్ 12 వారికి మెడల్స్ అందించడం జరుగుతుందన్నారు. గవర్నర్ ను హెలిప్యాడ్ వద్ద స్వాగతం , అనంతరం నన్నయ్య యూనివర్సిటీ లో స్నాతకోత్సవంలో సభ వేదికకు రావడం జరుగుతుందనీ అన్నారు.
ఈ సందర్శన లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, వైస్ ఛాన్సలర్ కె.పద్మరాజు , జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, అదనపు ఎస్పీ రాజశేఖర్ , టూరిజం ఆర్ది వీ. స్వామీ నాయుడు , ఆర్ అండ్ బి ఈ ఈ ఎస్ బి వి రెడ్డి, వైద్య అధికారులు కే. వేంకటేశ్వర రావు, డా ఎన్. సనత్ కుమారి, యూనివర్సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.