Breaking News

ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు

-ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎంపి, క్రీడా అంబాసిడర్లు
-బ్యాట్ పట్టి ఆకట్టుకున్న కలక్టర్, జేసీ, మునిసిపల్ కమిషనర్

-రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని , తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం అని కలక్టర్ కే. మాధవీలత, ఎంపి మార్గనీ భరత్ రామ్ లు పేర్కొన్నారు.

స్ధానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ డా కె మాధవి లత మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో యువత కు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతోందని అన్నారు. శారీరక శ్రమ తగ్గి ఉబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుండి వస్తున్నాయి తెలిపారు . నేటి ఆధునిక కాలంలో యువత ప్రతి ఒక్కరూ చురుకుగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కాపాడుకుంటూ క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యం పొందే విధంగా శిక్షణ పొందాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. యువతలో ఎక్కువగా క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా ప్రభుత్వం ముందడుగు లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి చక్కటి ఆలోచన చేశారన్నారు. యువతీ యువకులు పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనడం శుభ పరణామమని అన్నారు. తల్లి తండ్రులు, స్కూల్ యాజమాన్యాలు పిల్లల్లో ఆసక్తి నీ గమనించి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా కోరారు.

కార్యక్రమంలో భాగంగా ప్రపంచ స్థాయి ఛాంపియన్ లు వై. లలితాదేవి, ఐశ్వర్య, పి శివాజీ, ఎం లక్ష్మి, కె రాజేష్, జి భవాని లను జిల్లా కలెక్టర్, ఎంపి చేతుల మీదుగా సన్మానం చేసి సత్కరించారు.

ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గనీ భరత్ రామ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ వారి దిశా నిర్దేశనం మేరకు జిల్లా అధికారులు సమిష్టిగా పనిచేసి క్రీడా పోటీలను ఇప్పటి వరకు నిర్వహించి, జిల్ల స్థాయి పోటీలకు ఈరొజు శ్రీకారం చుట్టామన్నారు. యువత ఎందులోనూ తక్కువ కాదని, క్రీడల్లో వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇదొక అద్భుతమైన అవకాశం అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రీడల్లో ఆమేరకు ఫలితాలు సాధించలేకపో తున్నామని పేర్కొన్నారు. చైనా తో జనాభా సమానంగా ఉన్నా పతకాలు సాధించడంలో చాలా వెనుకబడి ఉన్నామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డి యువతలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందించే ప్రయత్నం లో ఆడుదాం ఆంధ్రా ఒక చక్కటి ఆలోచన అని భరత్ పేర్కొన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతు,  రాష్ట్రంలో మొట్ట మొదటగా యువతలో క్రీడా ప్రతిభను గుర్తించేందుకు ఆటల పోటీలు నిర్వహించడం అభినందనీయమని  అన్నారు. ఇది ఒక మంచి వేదిక అని , అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్ మాట్లాడుతూ, సచివాలయ స్థాయి నుంచి నియోజక వర్గ స్థాయి వరకు క్రీడల్లో యువత పాల్గొని విజయవంతం చేశారన్నారు. రానున్న రోజుల్లో వీరే రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని, వారికి ఆసక్తి ఉన్న రంగంలో మరింతగా ప్రతిభను మెరుగు పరుచుకోవానికి ఒక చక్కటి అవకాశం అన్నారు.

అనంతరం కోకో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ క్రీడా కోర్టులను ప్రారంభించి, క్రీడా పోటీలను ఆరంభించారు. . తొలుత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, మున్సిపల్ కమిషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన క్రీడా శిక్షకులు బీ ఎమ్ ఎమ్ శేషగిరి, డిపివో జెవి సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు, కోచ్ లు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *