విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నం బీహెచ్ఈఎల్ లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్లో గత మూడు రోజులపాటు జరిగిన కోరమాండల్ ఇంట్రా స్కూల్ సైన్స్ ఫెయిర్ చిన్నారులలో సరికొత్త ఆలోచనలను రేకెత్తింపచేసింది. విద్యార్థినీ విద్యార్థులు వినూత్న రీతిలో సూక్ష్మంగా రూపొందించిన వివిధ నమూనాలు, ప్రదర్శనయ్యాయి. ఎంతో ఉత్సాహంగా చిన్నారులు విభిన్న శ్రేణి ప్రాజెక్టుల ద్వారా తమ శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఆరోగ్యకరమైన పోటీ స్ఫూర్తిని పెంపొందించడంతోపాటు సైన్స్ మరియు ఆవిష్కరణ పట్ల వారిలో సరికొత్త అభిరుచిని నెలపొందించడానికి ఈ కార్యక్రమం వేదికగా మారింది సంపూర్ణ విద్యతో పాటు సైన్స్ టెక్నాలజీ రంగాలను అన్వేషించడానికి విద్యార్థులను ప్రోత్సహించడంలో ఈ స్కూలు అగ్రస్థానంలో నిలుస్తున్నది. స్కూలు ప్రిన్సిపల్ జి భారతి, వైస్ ప్రిన్సిపల్ ఆర్ఎస్ శెట్టి నేతృత్వంలో కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు, ఇతరుల సమన్వయకర్తలు పర్యవేక్షించారు.
Tags Visakhapatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …