విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి గురువారం రెవెన్యూ, మూడవ దశ రీసర్వే, ఇనామ్ & అసైన్డ్ భూములు, స్త్రీ & శిశు సంక్షేమం – ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ పథకం, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమం, జగనన్న ఆరోగ్య సురక్ష, డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, పీ&ఆర్డీ, ఎన్ఆర్ఈజిఎస్ – కరువు మండలాల్లో వేతన ఉత్పత్తి మరియు త్రాగునీరు , ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఏర్పాట్లు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సమీక్షించారు. నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, విజయవాడ ఆర్డీవో భవాని శంకర్, డ్వామా పీడీ జె. సునీత, డిఎంహెచ్ఓ డా.ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డా. జె. సుమన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి కె. శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు వైద్య ఆరోగ్యం, డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తూ అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలు జిల్లాలో పూర్తిస్థాయిలో అమలయ్యేల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.