విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“అమృత హస్తం” దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు స్వయంగాను, వాలంటీర్లతోను ఆక్సీ మీటర్స్, ఎన్ 95 మాస్క్ లను పంపిణీ చేశారు. అమృత హస్తం ద్వారా నిత్యం ఎంతో మందికి ఆకలి తీరుస్తూ అన్నదాత గా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ లలో వలస కూలీలకు, కరోనా బాధితులకు సేవలందించడంలో తమకు చేతనైనంత సాయం చేస్తుంది అమృత హస్తం. ఈ సందర్భంగా దారా కరుణశ్రీ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమాల నిర్వహణ అందరి సమిష్టి కృషి అని అన్నారు. హెల్త్ క్యాంపులు, పేదలకు బట్టలు పంపిణీ, పేదలకు నిత్యం ఆహార పంపిణీ, తదితర సేవా కార్యక్రమాలు ఏ విపత్కర పరిస్థితులు ఏర్పడిన అందరం కలిసి అమృత హస్తం తరఫున చేతనైనంతలో సాయం చేస్తున్నామన్నారు. మేము ఇలా ముందుకు వెళ్లడానికి కారణం దాతల సాయం, సమిష్టి అందరి కృషి అన్నారు. మనకు ఏదో అయిపోతుందని భయం కానీ… మనకు ఏం కాదులే అని నిర్లక్ష్యంగానే తగదని, వీలైనంతవరకూ ప్రతి వారు చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించి తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా వారు ఉండాలని, బయటకు అవసరమైతే తప్పితే ఇంటి వద్దే క్షేమంగా ఉంటూ పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవడం తీసుకోవడం మంచిదన్నారు. ఇది మీకు మీ కుటుంబానికి ఎంతో మంచిదన్నారు.
Tags vijayawada
Check Also
సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు …