-జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధాన్యం, బియ్యం వ్యాపారులు, రిటైలర్లు, చిల్లర వ్యాపారులు, పెద్ద రిటైలర్లు, ప్రాసెసర్లు/మిల్లర్లు తమ బియ్యం లేదా వడ్లుకు సంబంధించిన స్టాక్ వివరాలను అందరికీ అందుబాటులో ఉండేలా https://evegolls.nic.in/rice/login.htmlలో పొందుపరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ సూచించారు. స్టాక్ వివరాలను కేటగిరీలు వారీగా అంటే బియ్యం నూకలు, బాస్మతి కాని తెల్లబియ్యం, పారా బాయిల్ రైస్, బాస్మతి బియ్యం, వరి వివరాలను పొందుపరచాలన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్.. రైస్ మిల్లర్లు, రైస్ మర్చంట్ అసోసియేషన్, ధాన్యం, బియ్యం వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ స్టాక్ వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో విధిగా ప్రతి శుక్రవారం పొందుపరచాల్సిందిగా సూచించారు. నిర్లక్ష్యం వహించి, ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.