Breaking News

శ్రీవారి పచ్చకర్పూరం యొక్క మహిమ!

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగ వైకుంఠం శ్రీవేంకటేశ్వరస్వామికి ప్రతి నిత్యం పూజారులు పచ్చకర్పూర తిలకాన్ని పెడుతుంటారు. ఈ పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటన ధరిస్తే సాక్షాత్తు వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఇంకా స్వామివారి ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగితే స్వామివారి ప్రసాదం సేవించినంత ఫలితం ఉంటుంది. అలాగే వెంకన్న పచ్చకర్పూరాన్ని కుంకుమపువ్వు రెంటినీ కలిపి డబ్బుల డబ్బాలో పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది. వ్యాపారాలు ప్రతిరోజూ స్వామివారి పచ్చకర్పూర కుంకుమను నుదుటికి పెట్టుకుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఇంకా స్వామివారి పచ్చకర్పూరంతో హోమం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే తలనొప్పి, జలుబు నయమైపోతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి తలకు పెట్టుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది. అలాగే స్వామివారి పచ్చకర్పూరాన్ని తీపి పదార్థాలతో కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే ఆ యింట శుభకార్యాలు త్వరగా జరుగుతాయి. స్వామివారి పచ్చకర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే రాజసన్మానం, సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. స్వామివారి పచ్చకర్పూరం, పాలతో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ ఉంటే అన్ని రకాల గర్భదోషాలు నివృత్తి కలిగి సంతానం లేని వారికి సంతానం యోగం కలుగుతుంది.

Check Also

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *