-ముఖ ద్వారం నందు మరింతగా ఆకట్టుకునే లా గ్రీనరి ఉండాలని, అధికారులకు ఆదేశాలు
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రివర్ ఫ్రంట్ ప్లాజా పార్క్ లో ప్రజలకు మరింత ఆనందాన్ని కల్పించే హామీ థియేటర్ను ఫన్ సిట్టింగ్ ఏరియాలో నిర్మించాలని, ముఖ్యంగా ముఖద్వారం గ్రీనరీ తో ఆకట్టుకునే విధంగా ఉండాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణానది ఫేస్- 2, రిటైనింగ్ వాల్ వెంబడి సుందరంగా, ఆహ్లాదకరమైన పార్కు ఏర్పాటుకు కనకదుర్గ వారధి నుంచి పోలీస్ కాలనీ డీపీ స్టేషన్ వరకు 1.2 కి.మీ పొడవున సుమారు రూ.7.8 కోట్ల నగరపాలక సంస్థ ద్వార రూ.4.5 కోట్ల అర్బన్ గ్రీనరీ ద్వార నిర్మాణం జరుగుతున్న రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ పార్కును ప్రజలకు త్వరలో అందుబాటులోకి తీసుకు రావాలని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ట్రీ కెనాఫి ప్రజలను ఎంతగానో ఆకర్షిస్తుందని. ప్రజలను మరింత ఆకర్షించడానికి నిర్మాణం దశలో ఉన్న వాకింగ్ ట్రాక్, పాత్ వే, డిజైన్లు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేసారు. ఫన్ సిట్టింగ్ ఏరియా లో హామీ ధియేటర్ ను నిర్మించమని, ముఖ ద్వారం నందు మరింతగా ఆకట్టుకునే లా గ్రీనరి ఉండాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పార్క్ నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని అధికారులకు నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు ఇచ్చారు.