విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా పాఠశాల విద్యాధికారి (డీఎస్ఈవో)గా బుధవారం విధుల్లో చేరిన యూవీ సుబ్బారావు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఎస్.డిల్లీరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. పాఠశాలల్లో కల్పిస్తున్న మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలను సద్వినియోగం చేసుకొని ఉపాధ్యాయులు మంచి విద్యాబోధన అందించడం ద్వారా ఫలితాల సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. పదో తరగతి పరీక్షలు ఆసన్నమవుతున్న తరుణంలో పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు డీఎస్‌ఈవోకు సూచించారు. 1989లో కృష్ణా జిల్లా డీఈవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన సుబ్బారావు.. తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి 2020 నుంచి డీవైఈవోగా మచిలీపట్నంలో పనిచేసి.. ఇప్పుడు ఎన్‌టీఆర్ జిల్లా డీఎస్ఈవోగా బాధ్యతలు చేపట్టారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …