రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మతి. గంధం సునీత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ అధికారులు మరియు పంచాయతి అధికారులతో సమావేశమయ్యారు. మార్చి 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించుకొనేందుకు వివిధ రెవెన్యూ శాఖలకు సంబంధించిన రాజీపడదగిన కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలని అన్నారు. లోక్ అదాలత్ నందు పరిష్కారం పొందిన కేసులకు కోర్టు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదని, ఇరుపక్షాలకు అంగీకరమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కావున రానున్న లోక్ అదాలత్ నందు అధిక కేసులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులందరూ తమ సహకారం అందించాలన్నారు. ఈ సదస్సులో గవర్నమెంట్ ప్లీడర్ సి.హెచ్.వి. ప్రసాద్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సి. పి. ఆర్. రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా డెప్యుటీ కలెక్టర్ ఆర్. కృష్ణ నాయక్, పంచాయత్ సెక్రటరీలు, తహల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు
Tags Rājamahēndravaraṁ
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …