Breaking News

ఆడుదాం ఆంధ్రా క్రీడాకారులకు “ఆల్ ది బెస్ట్”

– జిల్లా తరపున 10 బృందాల ద్వారా 114 మంది హజరు
-జిల్లా నుంచి రెండు బస్సుల్లో బయలు దేరిన క్రీడాకారులు
– జేసీ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో మొదటి స్థానం లో నిలిచిన 114 మంది క్రీడాకారులు విశాఖపట్నంపేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి ఆడుదాం ఆంధ్రా బస్సులు బయలు దేరి వెళ్ళాయి. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లా తరపున ఐదు క్రిడాంశాల్లో క్రికెట్, కబాడి , కోకో, వాలీబాల్, బ్యాట్ మెంటన్ విభాగాల్లో పురుషులు, స్త్రీ బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు. మొత్తం ఈ బృందాలలో కలిపి 114 మంది విశాఖ పట్నం బయలు దేరినట్లు తెలిపారు. క్రికెట్ పోటీలలో  విజేతలు (సచివాలయం) పురుషుల జట్టు విజేతలు : మొదటి స్థానం అనపర్తి సచివాలయం -4  ,  మహిళా జట్టు విజేతలు : గోపాలపురం – దేవరపల్లి -1 సచివాలయం, బ్యాట్ మెంటన్ పోటీల విజేతలు పురుషుల విభాగంలో విజేతలు  ..  మొదటి స్థానం  – నిడదవోలు ,  మహిళా విభాగంలో  విజేతలు… మొదటి స్థానం – రాజమహేంద్రవరం అర్బన్ , వాలీబాల్  పోటి ….  విజేతలు పురుషుల విభాగంలో  మొదటి స్థానం – కొవ్వూరు – దారవరం ,  మహిళా విభాగంలో  … మొదటి స్థానం –  అనపర్తి – ఉలపల్లి, కబడి  పోటీ విజేతలు పురుషుల విభాగంలో  ..  మొదటి స్థానం – కొవ్వూరు – చిక్కాల -1 ,  మహిళా విభాగంలో  … మొదటి స్థానం – జగ్గంపేట – వెదురుపాక , ఖో ఖో పోటి విజేతలు పురుషుల విభాగంలో  ..  మొదటి స్థానం – గోపాలపురం ,   మహిళా విభాగంలో  .. మొదటి స్థానం – రాజానగరం సచివాలయం బృందాలు బయలు దేరి వెళ్ళాయి. క్రీడా వేదికలు క్రికెట్ పోటీలను రైల్వే స్టేడియం , ఆంధ్రా మెడికల్ కాలేజీ స్టేడియం, కేవికే స్టేడియం, కొమ్మాడి , డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, (గ్రౌండ్-బి), ఆంధ్రా యూనివర్సిటీ ఔట్ డోర్ గ్రౌండ్ డోర్) జరుగుతాయని తెలిపారు.  వాలీబాల్ పోటీలు ఆంధ్రా యూనివర్సిటీ ఔట్ డోర్ గ్రౌండ్ , కబాడి పోటీలు  జిమ్నాస్టిక్స్ హాల్  జమ్నాఈజం ఇండోర్ హాల్స్,  ఖో-ఖో పోటీలు ఆంధ్రా యూనివర్సిటీ జిమ్నాసియం అవుట్ గ్రౌండ్,   బ్యాడ్మింటన్ పోటీలు జి.వి.ఎమ్.సి. ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా తరపున నోడల్ అధికారిగా  జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి, బాస్కెట్ బాల్ కోచ్ ఎన్ ఎమ్ దాస్ విశాఖపట్నం కి పంపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి కృష్ణ నాయక్, యోగా కోచ్ బివిజి నాగేంద్ర, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *