Breaking News

” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతుల ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2047 నాటికి దేశంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ తమ వంతు గా భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ” సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి” నిర్మూలన గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మాధవీలత మాట్లాడుతూ, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి పిల్లల్లో వొచ్చే జన్యూ పరమైన వ్యాది అన్నారు. లక్షణాన్ని కలిగి ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ నీ సంప్రదించి గర్భం ధరించడానికి ప్రయత్నించే ముందు జన్యు సలహాదారుని చూడటం వలన సికిల్ సెల్ అనీమియాతో బిడ్డ పుట్టే మీ ప్రమాదాన్ని అర్థం చేసుకోవచ్చుననిఅన్నారు. సరైన అవగాహన కలిగి ఉండడం ద్వారా నివారణ సాధ్యమయ్యే చికిత్సలు, నివారణ చర్యలు పునరుత్పత్తి లెకుండా సాధ్యం అన్నారు.. ప్రథాన మంత్రి జనాజాతి ఆదివాసీ వాసన్యాయమహా అభియాన్ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో, కుటుంబాల్లో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

సికిల్ సెల్ ఎనీమియా చికిత్స ఉందన్నారు. రోగనిర్ధారణమైన వారికి హైడ్రాక్సి యూరియా అనే మాత్రలు ఇవ్వటంతో పాటు ఫోలిక్ యాసిడ్ అనే మాత్రలు కూడా ఇవ్వటం జరుగు తుందన్నారు. అత్యవసరమైతే రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుందన్నారు. రోగం యొక్క స్థాయిని బట్టి ఎముక మజ్జ మార్చడం జరుగుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్ జ్యోతి, వైద్య అధికారి డా ఎన్. వసుంధర, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బి. రాంబాబు, డివిజనల్ పంచాయతీ అధికారి జే వి సత్యనారాయణ లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *