గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల డ్రాఫ్ట్ రోల్ అనంతరం అందిన క్లైయిమ్స్ ని బూత్ లెవల్ అధికారులు(బిఎల్ఓ) అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసి రిపోర్ట్ ఇవ్వాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ కె.రాజ్యలక్ష్మీ స్పష్టం చేశారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు గురువారం స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తూర్పు నియోజకవర్గ బిఎల్ఓలు, సూపర్వైజరి అధికారులతో ఎన్నికల ఓటర్ల తుది జాబితాపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం తుది జాబితా అనంతరం కూడా అనేక రకాల దరఖాస్తులు అందుతున్నాయని ప్రతి దరఖాస్తుని బిఎల్ఓ సునిశితంగా పరిశీలించి, రిమార్క్ తో రిపోర్ట్ చేయాలని, ప్రతి రిపోర్ట్ కి సూపర్వైజరి అధికారులు సంతకం చేసి తదుపరి అనుమతుల కోసం ఏఈఆర్ఓకి పంపాలని స్పష్టం చేశారు. ప్రదానంగా నూతన ఓట్ల చేర్పులు, ఓట్ల తొలగింపు దరఖాస్తులు సూపర్వైజరి అధికారులు, ఏఈఆర్ఓలు నేరుగా పరిశీలించాలన్నారు. తూర్పు నియోజకవర్గంలో 250 పోలింగ్ కేంద్రాలకు గాను 250 మంది బిఎల్ఓలు, 19 మంది సూపర్వైజరి అధికారులు ఉన్నారన్నారు. బిఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను కూడా పరిశీలించి అవసరమైన వాటికై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని, సూపర్వైజరి అధికారులు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల పై భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.
సమావేశంలో ఏఈఆర్ఓలు డి.వెంకటలక్ష్మీ, ప్రదీప్ కుమార్, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, డిప్యూటీ తహసిల్దార్లు బి.భాస్కర్, మల్లేశ్వరరావు, సూపర్వైజరి అధికారులు, బిఎల్ఓలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …