విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసి రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ జల్లివిల్సన్, ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ లు అన్నారు . ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేర ర్ల సమావేశం విజయవాడ దాసరి నాగభూషణరావు భవన్ నందు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కోటేశ్వరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన జాతీయ రైతు కార్మిక సంఘాలు తలపెట్టినటువంటి గ్రామీణ బంద్ కు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నదని తెలిపారు. 16వ తేదీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులను వారు కోరారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం సామాన్య ప్రజల ప్రయోజనాలను విస్మరించిందని అన్నారు. కొంతమంది ధనవంతులకు అనుకూలంగా చట్టాలను తయారు చేయడం, మరియు పరిపాలన యంత్రాంగాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ విధానం వల్ల నిరుద్యోగం పెరిగిపోయి ఉపాధి నష్టం పెరిగిందన్నారు. కూరగాయలు, ఆహార ధాన్యాలు మొదలైన నిత్యవసర వస్తువులతో సహా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవడం చాలా బాధ కలిగిస్తున్నదని అన్నారు. వాటిని అదుపు చేయడానికి కూడా ప్రయత్నం చేయడము లేదని అన్నారు. సామాన్య మానవులపై కూడా వారు వాడే వస్తువులపై జీఎస్టీ తో పాటు ఇతర పరోక్ష పనులు వేయడం సామాన్యుల జీవితాల నడ్డి విరిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అణచివేత చర్యలతో తీవ్రంగా మరియు కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పేదలకు విద్య,వైద్యం, ఆరోగ్యం, ఉపాధి,ఇళ్ల స్థలాల సమస్య,భూ సమస్య,కూలి రేట్లు పెంపుదల, సామాజిక న్యాయం,దళితులు, మహిళలపై దాడులు వీటన్నిటినీ పరిష్కారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని అన్నారు. రాబోయే రెండు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం గావిస్తామని తెలిపారు. పేదల నడ్డి విరిచే ప్రభుత్వాలు ఏవైనా మనుగడలో సాధ్యం కాదని వారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేదలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలతోపాటు, వారికి ఉపయోగపడే చట్టాలు తెస్తామని కూడా పొందుపరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి చట్టానికి కేంద్ర బడ్జెట్ లో 4 లక్షల కోట్లు కేటాయించాలని, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కొత్త కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా స్థానికంగా అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆందోళనలు చేయాలని, ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాలకు జిల్లా, స్థానిక బృందాలు వెళ్లి పరిశీలనలు కూడా చేయాలని అక్కడ వచ్చిన సమస్యలపై స్థానిక అధికారులతో మాట్లాడి ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని సమావేశం తీర్మానించింది. 16వ తేదీ జాతీయ కార్మిక రైతు సంఘాలు ఇచ్చిన గ్రామీణబంద్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రేణులు పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం తీర్మానించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనిచేసే మేటీ ల సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.ఈ సమావేశం లో రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రావు, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు బండి వెంకటేశ్వరరావు, బి కేశవరెడ్డి, సిహెచ్ ప్రభాకర్,సి సుబ్రహ్మణ్యం,చిలుకూరు వెంకటేశ్వరరావు,కాబోతు ఈశ్వరరావు,తోపు కిష్టప్ప,ఆర్ విజయ,రాము నాయుడు, పండుగోలమని, ఉప్పెన నరసింహారావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …