Breaking News

మోటుమర్రి – విష్ణుపురం మధ్య డబుల్ లైన్ మరియు మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైల్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

-ఈ ప్రాజెక్టు రూ.1,746.20 కోట్ల . అంచనా వ్యయంతో ఆమోదించబడినది
-ఈ ప్రాజెక్ట్ వలన ప్రస్తుత లైన్ సామర్థ్యాన్ని పెంచుతూ రైళ్ల వేగం, సమయపాలన మరియు వ్యాగన్ టర్న్ రౌండ్ టైమ్‌లో మెరుగుదలకు దారితీస్తుంది .
-దీని ద్వారా రైళ్ల రాకపోకల రద్దీని నియంత్రించడానికి మరియు రైళ్ల రవాణాను పెంచడానికి దోహదపడుతుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మోటుమర్రి – విష్ణుపురం మధ్య 88.81 కి.మీ.ల రైల్వే లైన్ డబ్లింగ్ మరియు మోటుమారి వద్ద 10.87 కి.మీ.ల మేర రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టు ను ఈరోజు ఆమోదించింది ఈ రెండు ప్రాజెక్టులు దాదాపు రూ 1,746.20 కోట్ల అంచనా వ్యయంతో ఆమోదించబడ్డాయి. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతంలో సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశం ఉంది.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నూతన భారతదేశం దార్శనికతకు అనుగుణంగా ఈ రెండు ప్రాజెక్టులు లైన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా ఈ కీలకమైన సెక్షన్ లో రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించడంలో సహాయపడతాయి. దీనితోపాటు ప్రయాణీకుల మరియు సరుకు రవాణా రైళ్ల కదలికలకు ప్రయోజనం చేకూరుస్తూ రైళ్ల సగటు వేగాన్నిపెంచడంలో సహాయపడుతుంది అనగా ప్యాసింజర్ రైళ్ల సమయపాలనను మెరుగుపరచడం మరియు వ్యాగన్ టర్నరౌండ్ సమయాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుంది .
మోటుమర్రి – విష్ణుపురం సెక్షన్‌ను డబ్లింగ్ చేయడం మరియు మోటుమర్రి స్టేషన్‌లో రైల్ ఓవర్ రైల్:
మోటుమర్రి – విష్ణుపురం సెక్షన్ లో 88.81
8 కి.మీ.ల మేర దూరం విస్తరించి, కాజీపేట – విజయవాడ మధ్య అధిక ట్రాఫిక్ సాంద్రత నెట్ వర్క్ను సికింద్రాబాద్ – గుంటూరు హైలీ యుటిలైజ్డ్ నెట్వర్క్తో కలుపుతుంది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని ఖమ్మం,సూర్యాపేట & నల్గొండ జిల్లాలు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్. టి. ఆర్ జిల్లాల గుండా విస్తరించి ఉంది . పైన తెలిపిన జిల్లాల్లోని దాదాపు 95 మండలాలకు ఈ ప్రాజెక్ట్ నేరుగా సేవలందిస్తున్నాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలే కాకుండా మరియు తెలంగాణా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలతో కలిపే ఒక ముఖ్యమైన రైలు అనుసంధానం.

ఈ ముఖ్యమైన రైలు మార్గం సికింద్రాబాద్ను విజయవాడతో కలిపే దగ్గరి మార్గం. అందుకని, ఈ క్లిష్టమైన విభాగాన్ని డబ్లింగ్ చేయడం వలన సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా పనిచేయడం ద్వారా సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య రైలు కదలికలను మెరుగుపరుస్తుంది. ఇది ఈ విభాగంలో రైలు ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, కాజీపేట , వరంగల్ మరియు ఖమ్మం మీదుగా సాగే రద్దీగా ఉండే మార్గములో రద్దీని తగ్గిస్తుంది .

దీనితోపాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉపాధి కల్పించే అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని దిగువ తెలిపిన పారిశ్రామిక శ్రేణులతో పాటు అనేక పారిశ్రామిక సమూహాల లైన్ ద్వారా సేవలు అందించబడతాయి:

a) ఇనుము & ఉక్కు పరిశ్రమలు : చిట్యాల & నార్కట్‌పల్లిలో .
b) సిమెంట్ ప్లాంట్లు : విష్ణుపురం, జనపహాడ్ , మేళ్లచెరువు , ముట్టంపల్లి , జగ్గయ్యపేట , రామాపురం తదితర ప్రాంతాల్లో.
c) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (4,000 మెగావాట్లు) :విష్ణుపురం సమీపంలో
d) ఆహార ధాన్యాల (ఎఫ్‌సీఐ) సైడింగ్లు : నాగిరెడ్డిపల్లి , నల్గొండ , మిర్యాలగూడ వద్ద
e) పారిశ్రామిక సమూహాలు : హైదరాబాద్, విజయవాడ, విష్ణుపురం , నార్కట్‌పల్లి మొదలైనవి,
f) 100 కంటే ఎక్కువ వేర్ హౌస్‌లు & కోల్డ్ స్టోరేజీలు: హైదరాబాద్ & విజయవాడ చుట్టూ

ప్రస్తుతం, పరిమిత లైన్ సామర్థ్యం కారణంగా, అనగా సింగిల్ లైన్ వలన ఈ సెక్షన్ లో సరకు రవాణా తరలింపు ప్రభావితమైంది. ఈ రైలు మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, సిమెంట్, బొగ్గు మరియు ఇతర స్థానిక ఉత్పత్తుల వేగవంతమైన రవాణా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రజల నిరంతరాయ రాకపోకలను కూడా సులభతరం చేస్తుంది. దీనివలన సికింద్రాబాద్ మరియు విజయవాడ స్టేషన్ల మధ్య నడిచే వివిధ రైళ్ల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, భారతదేశంలోని తూర్పు ప్రాంతాల నుండి భారతదేశంలోని పశ్చిమ ప్రాంతాలకు సరుకు రవాణా క్రమంగా పెరుగుతోంది. అందువల్ల, ఈ రైలు అనుసంధానాన్ని డబ్లింగ్ చేయడం వల్ల అధిక ట్రాఫిక్‌ను నిర్వహించడం మరియు రైలు వేగం మరియు సెక్షన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రైళ్ల నిలుపుదలను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మోటుమర్రి స్టేషన్ వద్ద 10.87 కిలోమీటర్ల పరిధి మేర విస్తరించే రైల్ ఓవర్ రైల్, విష్ణుపురం మరియు డోర్నకల్ / భద్రాచలం రోడ్ / కాజీపేట మధ్య కదులుతున్న రైళ్ల క్రాసింగ్ లను నివారిస్తుంది. ఇది రైళ్ల నిలుపుదలను నివారిస్తుంది మరియు సెక్షన్‌లో రైళ్ల యొక్క నిరంతరాయ కదలికలను సులభతరం చేస్తుంది.

ముఖ్యంగా, మోటుమర్రి – విష్ణుపురం సెక్షన్‌ను డబ్లింగ్ చేయడం మరియు మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైల్, సెక్షన్ సామర్థ్యాన్ని పెంచుతుంది, తద్వారా అదనంగా రైళ్లను ప్రవేశపెట్టడానికి / నడపడానికి మార్గం సుగమం చేస్తుంది.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *