Breaking News

మారిస్ స్టెల్లా కాలేజ్ లో సోషల్ ఇష్యూస్ పై ఎగ్జిబిషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వీస్ లెర్నింగ్ ప్రోగ్రాం లో భాగంగా గురువారం మారిస్ స్టెల్లా కాలేజ్ ఆడిటోరియం లో సోషల్ ఇష్యూస్ పై ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ప్రదర్శన ను నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు ప్రారంభించారు. విద్యార్థినులు సమాజం అవసరతలలో భాగస్వామ్యం కలిగి వుండాలని, సాంఘిక ఆర్థిక రాజకీయ అంశాలు స్వచ్ఛత పోషకాహారం తదితర అంశాలపై తమ గ్రామం లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సంతోషం వ్యక్తంపరిచారు. ఈ ఎగ్జిబిషన్ లో స్వచ్ఛత, పరిశుభ్రత, రిటైల్ మార్కెటింగ్, పోషకాహారం, బ్లడ్ గ్రూపు, రక్త దానం వంటి పాలు అంశాలు చర్ట్స్ మోడల్స్ వుంచారు. ప్రిన్సిపల్ Dr సిస్టర్ రేఖ మాట్లాడుతూ కళాశాల విద్యార్థినులు తరగతి గదుల బయట విద్య ను అభ్యసిస్తున్నారు. జీవిత పాఠాలను చదువుతో పాటు సర్వీస్ లెర్నింగ్ కార్యక్రమం లో ఎన్నో విషయాలు తెలుసుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ  కార్యక్రమానికి సర్వీస్ లెర్నింగ్ కోఆర్డినేటర్ Dr సిస్టర్ ఇన్నేసియా, సిస్టర్ సహాయ మేరీ, కరస్పాండెంట్ సిస్టర్ లేన క్వాద్రశ్, ప్రకాష్, రమేష్, Dr భారత జ్యోతి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *