విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలు ఈనెల 29 తేది లోపు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలని ఉపకార్మిక కమిషనర్ సిహెచ్ ఆషారాణి అన్నారు. శుక్రవారం నగరంలోని సూర్యారావు పేట ఉపకార్మిక కమిషనర్ వారి కార్యాలయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలకు చెందిన వర్తక యాజమాన్య సంఘాలతో లైసెన్స్ విధి విధానాలపై ఉపకార్మిక కమిషనర్ సిహెచ్ ఆషారాణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం 1988 కింద వ్యాపార సంస్థలు, దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. దీనిలో భాగంగా జిల్లాకు చెందిన అన్ని వ్యాపార సంస్థల యాజమాన్యలకు లైసెన్స్‌పై అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఈనెల 29వ తేదిలోగా రిజిస్ట్రేషన్ /లైసెన్స్ పొందవలసి ఉంటుందన్నారు. ఇంకనూ లైసెన్స్ పొందని వ్యాపార సంస్థలు సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించాలని ఆమె కోరారు. కార్మిక చట్ట ప్రకారం లైసెన్స్ లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే వారిపై కార్మిక చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఉపకార్మిక కమిషనర్ సిహెచ్ ఆషారాణి అన్నారు. సమావేశంలో సంయుక్త కార్మిక కమీషనర్ ఎ. రాణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కె. విద్యాధరరావ్, ఫర్నీచర్ అసోసియేషన్ అధ్యక్షులు ఇ. ధామోదర్రావు, సత్యనారాయణపురం వర్తక సంఘం అధ్యక్షులు సి.సి.కేసవరావు, సెక్రటరీ ఎన్. గోపాల కృష్ణ, ది కృష్ణా డిస్ట్రిక్ట్ హౌల్ సెల్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి.ఎస్ఆర్కె. ప్రసాద్, ఆటోనగర్ ఇండ్రస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …