-జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి.ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్ఆర్ జిల్లాలోని 6 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1 మినీ అంగన్వాడీ కార్యకర్త, 4 ఆయా పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్ మైలవరం, చిల్లకల్లు నందిగామ మరియు తిరువూరు పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలను భర్తీ చేయనున్నామన్నారు. మినీ అంగన్వాడీ కార్యకర్త, ఆయా పోస్టులకు అభ్యర్థులు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత పొంది, స్థానిక వివాహిత మహిళాలైన వారికి మాత్రమే ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. అర్హత గల అభ్యర్థులు సీడీపీవో ఆఫీస్ ను సంప్రదించి ఈనెల 20వ తేది లోపు ధరఖాస్తులు చేసుకోవలసి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు సంభందిత ఐసిడిఎస్ కార్యాలయ అధికారులను సంప్రదించవలసినదిగా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి జి. ఉమాదేవి ఆ ప్రకటనలో తెలిపారు.