తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాయలసీమ మరియు నెల్లూరు (జోన్-4 మరియు జోన్-5) జిల్లాల సంయుక్త ఆధ్వర్యంలో విజ్ఞాన సుధా డిగ్రీ మరియు పీజీ కళాశాల,చిత్తూరు నందు 15-02-2024 తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి రీజినల్ జాబ్ మేళా నిర్వహించబడును. ఈ రీజినల్ జాబ్ మేళాకు ఐటి సెక్టార్, బీపీఓ సెక్టార్ మరియు ఎలక్ట్రానిక్ సెక్టార్ మరియు రిటైల్ సెక్టార్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మరియు బి ఎఫ్ ఎస్ ఐ సెక్టార్ల కు సంబంధించిన 100 పైగా బహుళ జాతీయ కంపెనీలు లలో ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును.
విద్యా అర్హతలు: ఐదవ తరగతి లేదా పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ లేదా ఏదైనా పిజీలో ఉత్తీర్ణత అయిన యువతీ యువకులు ఈ రీజనల్ జాబ్ మేళా కు అర్హులు.
ఈ రీజినల్ జాబ్ మేళాలో అర్హత సాధించిన యువతీ యువకులకు నెల (Month) కు కనీస వేతనం 13,000/- నుంచి 30,000/- వివిధ రకాల కంపెనీలలో ఉద్యోగ నియామకాలు కల్పించబడును.
ఈ జాబ్ మేళాకు హాజరయ్యే యువతీ యువకులు క్రింద తెలుపబడిన రిజిస్ట్రేషన్ లింకులో తప్పనిసరిగా నమోదు చేసుకోవలెను అదేవిధంగా ఈ రీజినల్ జాబ్ మేళా కు హాజరయ్యే యువతీ యువకులు ఆధార్ కార్డ్ జిరాక్స్,20Resumes (బయోడేటా ఫార్మ్స్) మరియు జిరాక్స్ సర్టిఫికేట్స్ తో తప్పని సరిగా తీసుకొని రావాలి అని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేసారు.
రిజిస్ట్రేషన్ లింక్: https://shorturl.at/jADY6
మొబైల్ నెంబర్:9063561786,8465830771,8142509017.