-జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాల వెల్లువ పై శనివారం నుంచి గ్రామ స్థాయి లో ఇంటింటి సర్వే నిర్వహించి పాడి రైతుల లబ్దిదారుల గుర్తింపు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు.
శుక్రవారం హుకుంపేట గ్రామ సచివాలయం 1 లో పాలసేకరణ పై గ్రామ సచివాలయ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జెసి హాజరయ్యారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జగనన్న పాల సేకరణ పై జిల్లా, డివిజన్, మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి ప్రక్రియ కోసం గ్రామ స్థాయి, సచివాలయ పరిధిలో చేపట్టవలసిన సర్వే పై క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడం జరుగుతోందనీ పేర్కొన్నారు. ప్రభుత్వం జగనన్న పాల వెల్లువ ద్వారా సేకరించిన పాలకు వెన్న శాతం, చిక్కదనం ఆధారంగా ధర చెల్లింపులు చేస్తామని తెలియ చేశారు. జిల్లా లో చేయూత, ఆసరా కింద ప్రయోజనం కలిగిన పశు రైతులను గుర్తించి, వారి వివరాలూ జే పీ వి.. పోర్టల్ లో నమోదు చెయ్యాల్సి ఉందన్నారు. మండల పరిధిలో ఉన్న జగనన్న పాల వెల్లువ కేంద్రానికి గ్రామ సచివాలయం ఉన్న పాడి రైతు లబ్ధిదారుల ద్వారా పాల సేకరణ చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్క పాల రైతుకి ఎనిమిది అంకెల తో కూడిన డిజిటల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుందనీ, ఆమేరకు పాల సేకరణ జరిపిన వెన్న శాతం, చిక్కదనం ఆధారంగా చేసుకుని నేరుగా నగదు చెల్లింపులు చేస్తామని తెలియ చేశారు.
మార్చి ఒకటవ తేదీ నుంచి పాల సేకరణ ప్రక్రియ ను ప్రారంభించడం జరుగుతుందనీ, ఆలోగా వాలంటీర్లు సేకరించిన డేటా ఎంట్రీ సంభందిత డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో రూరల్ ఎంపీడీవో డి. శ్రీనివాస రావు, మండల వెటర్నరీ డాక్టర్ డా సౌమ్య, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.