Breaking News

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించండి..

-ఆహారం తీసుకునే ప్రతిసారీ చేతులు శుభ్రపరచుకోవాలి
-జిల్లాలో 3595 సంస్థలలో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ
-జిల్లా వ్యాప్తంగా 3,88,268 పిల్లలకు మాత్రలు పంపిణీ లక్ష్యం.
-ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నులిమేద్దాం..
-డా. కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ లో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న 3,88,268 పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3,78,949  పంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత పేర్కొన్నారు. జాతీయ నులిపురుగల నివారణ దినోత్సవాన్ని కార్యక్రమంను పురస్కరించుకొని నులి పురుగుల నివారణ మందు పంపిణి కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక సున్నిలాల్ జాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ మాధవీలత, వైద్యాధికారితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3595 సంస్థల్లో నులి పురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో ఒకటి నుంచి 19 సంవత్సరాల లోపు గల 3,88,268 పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను  ఇప్పటి వరకు 3,78,949 మందికి పంపిణీ చేసి 98 శాతం తో నిలిచామని కలెక్టర్ అన్నారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ, ప్రవేటు పాఠశాల, కళాశాల విద్యార్థులకు, ఇతర సంస్థల పంపిణీ చేస్తున్నా మన్నారు. కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణ వల్ల అనారోగ్యంకి గురవుతారని పేర్కొన్నారు. ఆహారం తీసుకునే సందర్భాల్లో ఖచ్చితంగా విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు. నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అల్బెండో జోల్ మాత్రల తో వీటికి చెక్ పెట్టి ఆరోగ్యం గా ఉండవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.

2-19 సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరు ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని, ఈ మాత్రలు వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

చిన్నారులతో ముచ్చటించిన కలెక్టర్ డా. మాధవీ లత..

మనలో ఉన్న నులిపురుగు నివారణ కొరకు ప్రతి విద్యార్థి ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చనన్నారు. తద్వారా మనలోని రక్తహీనతను అధిగమించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటామని ఆ దిశగా విద్యార్థులందరూ తప్పకుండా ఆల్బెండజోల్ జోన్ మాత్రలు వేసుకొని నులిపురుగులు నివారిద్దామని కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా ఉంటే చదువుల్లో బాగా రాణిస్తామని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కే వెంకటేశ్వరరావు, డి ఎల్ ఎ టి ఓ డా. ఎన్. వసుందర, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. విన్నూత్న, ప్రోగ్రాం ఆఫీసర్ టి.డాక్టర్ రాజీవ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *