Breaking News

వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావారి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు మరియు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 23వ అధికరణ ప్రకారం మానవ అక్రమ రవాణా మరియు వెట్టిచాకిరీని నిషిద్ధం అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారికి చట్టపరమైన శిక్షలు ఉన్నాయన్నారు.

“వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన చట్టం, 1976″లోని కీలక అంశాలను ఆమె వివరించారు. మనుషులను స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా, మోసపూరితంగా, బెదిరింపులతో పని చేయించుకోవడం, ఆ పనికి తగినంత వేతనం ఇవ్వకపోవడం, వారిని నిర్బంధంలో ఉంచి స్వేచ్ఛకు భంగం కలిగించడం నేరమని పేర్కొన్నారు. ఈ నేరాలను పోలీసు వారు కేసు నమోదు చేసి విచారించే అధికారం ఉంటుందని తెలిపారు. వెట్టిచాకిరీ బాధితులను గుర్తించడం, రక్షణ కల్పించడం, విడిపించి పునరావాస చర్యలు తీసుకోవడంలో వివిధ శాఖల పాత్ర గురించి వివరించారు. అందరి సమన్వయ కృషితో ఈ చట్టం మెరుగ్గా అమలు జరుగుతుందని అన్నారు.

అనంతరం న్యాయమూర్తి ప్రత్యూష కుమారి కార్యక్రమానికి హాజరైనవారందరితో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యలయం నుంచి పుష్కర ఘాట్ వరకు ర్యాలీ నిర్వహించారు, మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

ఈ సదస్సులో, అనంతరం ర్యాలీలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ బి.ఎస్. ఎం.వలీ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, మైన్స్ అండ్ జియోలాజి అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్ . సుబ్రహ్మణ్యం, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ హెడ్ ప్రోగ్రాం పార్ట్నర్షిప్ మేనేజర్ ఎం. జేసుదాస్ , రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, డి.ఆర్.డి.ఏ., మెప్మా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సభ్యులు, ఒన్ స్టాప్ క్రైసిస్ టీమ్ సభ్యులు, వివిధ ఎన్జీవో సంస్థల వారు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *