Breaking News

కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పూర్తి చేయాలని, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం కమిషనర్ ఛాంబర్ లో నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ స్పెషల్ గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు నిర్వహించే కాంట్రాక్టర్ల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఏర్పాటు చేశామన్నారు. గ్రీవెన్స్ లో కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్నసమస్యలను తమ దృష్టికి తెచ్చారని, వాటిని నిర్దేశిత గడువులో పరిష్కారం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. కాంట్రాక్టర్లు వర్క్ అగ్రిమెంట్ పొందిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా, నాణ్యతా ప్రమణాలు పాటిస్తూ పనులు పూర్తి చేసినప్పుడే నగర అభివృద్ధి జరుగుతుందని, కాంట్రాక్టర్లు తాము పూర్తి చేసిన పనులకు సంబందించి బిల్లుల ఆన్ లైన్ చేయడం, చెల్లింపుల్లో ఎదురయ్యే సమస్యలను ప్రతి శుక్రవారం జరిగే స్పెషల్ గ్రీవెన్స్ లో తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. నగరంలో జరిగిన కొన్ని అభివృద్ధి పనుల పై ఫిర్యాదులు వస్తున్నాయని, ఆయా పనులను ఇంజినీరింగ్ అధికారులు మరొకసారి పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లు అందించిన ఆర్జీలను, ఫిర్యాదులను ప్రత్యేకంగా నమోదు చేయాలని, వారి సమస్యలు పరిష్కారం అయ్యాక తెలియచేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులు జరిగే సమయంలోనే ఆయా స్టేజిల ప్రకారం పనులను ఎంబుక్ ను రికార్డ్ ను ఎప్పటికప్పుడు చేయించాలని ఏ.ఈ.లను ఆదేశించామన్నారు. బిల్లుల చెల్లింపులో కూడా జాప్యం లేకుండా అన్ని స్టేజిల్లో వేగంగా రికార్డ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *