విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
దేశ సమగ్రత, సమభావం, సత్వర సుస్థిర అభివృద్ధి నిర్మాణం కోసం యూనియన్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ అలయెన్స్ (థర్డ్ ఫ్రంట్) ప్రణాళికలో విప్లవాత్మకమైన ప్రగతిశీల అభివృద్ధికర పది చట్టాలను చేరుస్తున్నట్టు థర్డ్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ తెలిపారు. శుక్రవారం గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ఎన్డీయే ఫ్రంట్‌ని వ్యతిరేకించడానికి గాని ఇండియా ఫ్రంట్‌ని విమర్శించడానికో థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలు నెరవేర్చలేని ఎన్ని ఫ్రంట్‌లు వున్నా అవి నిరుపయోగమేనని అన్నారు. మా థర్డ్ ఫ్రంట్‌లో మాత్రం ప్రజా ప్రయోజనాల్ని నెరవేర్చడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాన్ని కూడా నూతన రాజకీయ ఆర్థిక విధానాలతో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో ప్రజల అభివృద్దే ఎజెండా అని, నూతన రాజకీయ ఆర్ధిక విధానాలు మా విధానాలని అన్నారు. అన్నీ పార్టీలు ఫ్రంట్ పేరుతో ఉచిత పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ, ప్రజల సమగ్రత సుస్థిర అభివృద్ధి కోసం సమాజానికి ఎంతో ఆరోగ్యకరమైన పది చట్టాలను తీసుకొస్తున్నామన్నారు. ప్రజల్లోకి వెళ్లే ముందు ఈ 10 చట్టాలను అనుభవజ్ఞులైన మేధావులతో బహిరంగంగా చర్చించి, అప్పుడు కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ప్రజాక్షేత్రంలోకి వెళతామన్నారు. ఈ చట్టాలను విశ్లేషించడానికి సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో అనుభవజ్ఞులైన డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఐఎఎస్, ప్రొఫెసర్ నాగేశ్వర్, కత్తి పద్మారావు, జేడీ లక్ష్మీనారాయణ ఐపిఎస్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఐపిఎస్, తెలకపల్లి రవిలాంటి సామాజిక విశ్లేషకులు మరి కొంతమందిని ఒకే వేదిక మీదకి ఆహ్వానించి ఈ చట్టాలపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లాల్ భీమ్ నేత కొప్పుల విజయబాబు, కె. రమేష్, తోట సంగమేశ్వరరావు, కోండా సంజయ్ అడ్వకేట్, కొక్కిరిగడ్డ శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …