Breaking News

మౌళిక సదుపాయాల కల్పనలో 36వ డివిజన్‌ ముందంజ… : కార్పొరేటర్‌ బాలి గోవింద్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
36వ డివిజన్‌లో మౌళిక సదుపాయాల కల్పనలో ముందంజలో వుందని స్థానికులు కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ను అభినందిస్తున్నారు. త్రాగునీరు పంపులు, సైడ్‌ కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ, డివిజన్‌లో రోడ్డుమీదే కాకుండా ప్రతి సందులో పాడైపోయి, రోడ్డుకన్నా దిగునవున్న రోడ్డులను కూడా రోడ్డు స్థాయికి పెంచి వానాకాలంలో నీరు నిలబడకుండా వాహనదారులు, నడిచే పిల్లలు, పెద్దలు, వృద్దులకు ఇబ్బంది కలగకుండా అందంగా తీర్చిదిద్దే విధంగా రోడ్డు నిర్మాణం చేపట్టి స్థానికుల మన్ననలు చూరగొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ బాలి గోవింద్‌ను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ డివిజన్‌ అభివృద్ధిలో అన్ని విధాల సహకరించిన మాజీ మంత్రి, సెంట్రల్ నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి తన కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్‌లో త్రాగునీటి ఇబ్బంది, డ్రైనేజీ, సైడ్‌ కాలువల ఇబ్బంది, వీధిదీపాలు, రోడ్ల మరమ్మతులు, తదితర మౌళిక సదుపాయాలు విషయంలో స్థానికులు తనవద్దకు వచ్చిన వెంటనే అధికారులు దృష్టికి తీసుకువెళ్ళి సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నానన్నారు. సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్‌ శాఖ, పారిశుధ్య, డ్రైనేజీ, వాటర్‌వర్క్స్‌, సచివాలయ సిబ్బంది తదితర శాఖల వారు మరమ్మత్తుల విషయంలో కాంట్రాక్టర్లు, వర్కర్స్‌ సహాయ సహకారాల వల్ల అందరి సమిష్టి కృషితో డివిజన్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఇది అందరి విజయమన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో పార్టీలకు అతీతంగా స్థానికులకు, వారి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ 36వ డివిజన్‌లో మౌళికాభివృద్ధిలో ముందుకుపోతున్నామన్నారు. డివిజన్‌లోని ప్రజలు తనపై నమ్మకంతో కార్పొరేటర్‌గా గెలిపించినందుకు వారికి సమస్యలకు అండగా నిలబడి వారికి ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అందేలా చూసి, వారికి అవగాహన కల్పించటంతోపాటు సెంట్రల్‌ నియోజకవర్గంలో 36వ డివిజన్‌ను మౌళిక సదుపాయాలు, పారిశుధ్య విషయంలో కాని అన్ని విధాలా తీర్చిదిద్ది డివిజన్‌ను ప్రత్యేక స్థానం పొందటమే కాకుండా ‘క్లీన్‌ అండ్‌ బ్యూటీఫుల్‌ డివిజన్‌’గా తయారు చేయడానికి కృషి చేస్తానన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *