-ఆల్ ది బెస్ట్ అభినందించిన కలెక్టర్ మాధవీలత
-రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ అందచేత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల ద్వారా తగిన గుర్తింపు లభించడం, తద్వారా మరింత తర్ఫీదు కోసం క్రీకెట్ అకాడమీ కి ఎంపికైన చల్లారపు శివ రానున్న రోజుల్లో జిల్లాకు, రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందనలు తెలిపారు.
మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా స్పోర్ట్స్ ఆధారిటి అధికారులు క్రికెటర్ శివ తో కలిసి కలెక్టర్ కలవడం జరిగింది. ఈ సందర్బంగా, కలెక్టర్ కె. మాధవీలత క్రికెటర్ శివ కి అభినందనలు తెలిపారు. సచివాలయం స్థాయి నుంచి క్రీడా నైపుణ్యం ప్రదర్శించి, రాష్ట్ర స్థాయి కి చేరుకున్న చల్లారపు శివ ఎంతో మందికి స్ఫూర్తి నివ్వడం జరిగిందనీ పేర్కొన్నారు. అండర్ 21 కేటగిరీ లో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమి కి శిక్షణ నిమిత్తం ఆంధ్ర ప్రదేశ్ క్రికెట్ అకాడమి ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అండర్ 21 కేటగిరీ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కి త్వరలో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని అన్నారు. మరింత ప్రతిభ ప్రదర్శించి ఉన్నత స్థాయి కి చేరుకోవాలని అభిలాష వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర క్రీడా సాధికార సంస్ధ తరపున శివకు క్రికెట్ కిట్ ను అంద చేశారు.
అనపర్తి కి చెందిన తల్లితండ్రులు జనార్ధన్ రావు – పార్వతి లు దినసరి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుటుంబానికి చెందిన, శివ చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలనే కోరిక తో నిరంతర కృషి చేసినట్లు అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్రా పోటీలలో పాల్గొన్న క్రికెటర్ల యొక్క ప్రతిభ ఆధారంగా క్రికెట్ అకాడెమీ కి శివ ఎంపిక అయినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో దేశానికి కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందనీ తెలియ చేశారు.
కలెక్టర్ శివ తో కలిసిన వారిలో బాస్కెట్ బాల్ కోచ్ ఎన్. మోహన్ దాస్, యోగా కోచ్ బివిజీ నాగేంద్రన్ లు ఉన్నారు.