Breaking News

మిల్లెట్స్ ను ప్రోత్సహిస్తున్న ట్రూ గుడ్ సంస్థ  చేస్తున్న కృషి అభినందనీయం

-మిలెట్స్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు మంత్రి చేతులామీదుగా బహుమతి ప్రధానం
-రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సంపూర్ణ పోషక విలువలతో కూడిన నాణ్యమైన మిల్కెట్స్ తో కూడిన ఆహారాన్ని అందిస్తోంది
-మంత్రి వేణు గోపాల్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభను పాఠశాల స్థాయి నుంచే గుర్తించి ప్రోత్సహించే ఒక బృహత్తర కార్యాచరణతో మిల్లెట్ ధాన్యానికి ఛాంపియన్‌గా ఉన్న ట్రూ గుడ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమా టోగ్రాఫి శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మిల్లెట్ ఆహార పదార్థాల “స్నాక్ బ్రాండ్” లోగో పోటీ విజేతలకు ట్రూ గుడ్ సంస్థ అందిస్తున్న బహుమతులు ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ ట్రూ గుడ్ సంస్థ ఎండి రాజు భూపతి తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ .. ట్రూ గ్రూప్ సంస్థ నిర్వహించిన మిల్లెట్ స్నాక్ బ్రాండ్ లోగో పోటలలో విజేతలైన విద్యార్థులను సత్కరించి బహుమతులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉభయ రాష్ట్రాలలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన నలుగురికి ఒక్కొక్క ట్యాబ్ లు, స్మార్ట్‌వాచ్‌లు మరియు ల్యాప్‌ టాప్‌లను బహుమతు లుగా అందించగా, ఈ పోటీలలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులను ప్రోత్సాహం అందించే క్రమంలో మెరిట్ సర్టిఫికేట్‌లను అందిస్తున్నారని మంత్రి తెలిపారు..

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విద్య కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి బిడ్డ వారు మానసిక పరిపక్వతతో సంపూర్ణ స్థాయి ఆరోగ్యంగా ఉండేందుకు గాను మంచి పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక స్తోమత లేని తల్లితండ్రుల పిల్లలు ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి ఆరోగ్యమే లక్ష్యంగా జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా ఆహారాన్ని అందించడం జరుగుతోందని అన్నారు. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం వలన పిల్లల్లో హిమోగ్లోబిన్ శాతం పెరిగి వారి మానసిక పరిపక్వత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. మిల్లెట్ చిరుధాన్యాలతో తయారు చేసిన పోషక విలువలతో కూడిన నాణ్యమైన చిక్కిలను విద్యార్థి దశలో ఉన్న పిల్లలు తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలన్నారు. సమాజ నిర్మాణానికి బాల బాలికలు పిల్లర్లు వంటి వారిని, బాలబాలికలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలనీ మంత్రి పేర్కొన్నారు. మన పిల్లలు ఎక్కడికి వెళ్లినా రాణించి వారీ ప్రత్యేకతను చాటుకునే విధంగా ప్రాథమిక విద్య నుండి ఇంగ్లీష్ మీడియం, ఐబి, బైజుస్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన విద్య ద్వారానే సాధ్యమవు తుందని నమ్మి అత్యంత ప్రాధాన్యతను కల్పిస్తున్నా రన్నారు. ప్రతి విద్యార్థి జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి విద్యార్థులకు సూచించారు.

స్వాతంత్రానంతరం దీర్ఘకాలికంగా జరగని కుల గణన కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన వెంటనే అమలు చేసి 15 రోజుల్లో సర్వే పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నారని మంత్రిస్పష్టం చేశారు.

ట్రూ గుడ్ సంస్థ ఎండి రాజు భూపతి మాట్లాడుతూ ట్రూ గుడ్ యొక్క ఆర్ట్ కాంపిటీషన్ బ్రాండ్ యొక్క వార్షిక కళ పోటీ యొక్క మొదటి ఎడిషన్‌లో 5000 మందికి పైగా పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. బహుళ రిటైల్ మరియు సంస్థాగత మార్గాల ద్వారా నెలకు 6 కోట్లకు పైగా పోషకమైన మిల్లెట్ స్నాక్ బార్‌లను విక్రయిస్తూ, ట్రూ గుడ్‌ను 2018లో స్థాపించామన్నారు. ట్రూ గుడ్ యొక్క కళల పోటీలో 200 పైగా పాఠశాలల నుండి 5 నుండి 10వ తరగతి వరకు పిల్లలు పాల్గొన్నారని తెలిపారు. భారత దేశంలోనే అతిపెద్ద మిల్లెట్ స్నాక్ బ్రాండ్, ట్రూ గుడ్ మొదటి ఎడిషన్‌లో ఎక్కువ మంది పిల్లల నుండి ఎంట్రీలను నమోదు చేసి, లోగో పోటీ, బ్రాండ్ యొక్క వార్షిక కళల పోటీలో భాగంగా మిల్లెట్ ఆధారిత స్నాక్స్ లేదా చిక్కీల ప్రయోజనాల గురించి పిల్లలకు తెలియజేయడం, పోషకమైన, రుచికరమైన మరియు సరసమైన అల్పాహారం ఎంపికగా, బ్రాండ్‌ను కూడా తయారు చేయడం కోసం నిర్వహిస్తున్న మన్నారు. బహుళ రిటైల్ మరియు సంస్థాగత మార్గాల ద్వారా నెలకు 6 కోట్లకు పైగా పోషకమైన మిల్లెట్ స్నాక్ బార్‌లను విక్రయిస్తోందన్నారు.

ఈ సందర్భంగా విజేతులైన విద్యార్థులకు మంత్రి వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.

మొదటి బహుమతిగా..

విశాఖపట్నం జిల్లా.. థానా గ్రామానికి చెందిన పి. మధు తేజ శ్రీ (9వ తరగతి) ల్యాప్ టాప్ ను,

ద్వితీయ బహుమతిగా..

కృష్ణ జిల్లా.. మచిలీపట్నానికి చెందిన ఎన్. కృష్ణ వేణి (9వ తరగతి) సాంసంగ్ ట్యాబ్…

తృతీయ బహుమతిగా..

సత్యసాయి జిల్లా.. పేరూరు గ్రామానికి చెందిన డి.నవదీప్ (6వ తరగతి) లెనోవా ట్యాబ్ ను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ట్రూ గుడ్ సంస్థ ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులను తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *