-జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మిశ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల కుటుంబాలలోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, ముస్లిం మైనారిటీ లకు వైఎస్సార్ సాదితోఫా 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ – 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుపతి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ యం.గురుమూర్తి, తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష,ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, తో కలసి జిల్లా కలెక్టర్ డాక్టర్. జి.లక్ష్మిశ పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 2023 అక్టోబర్ నుండి డిసెంబర్ – 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన వారికి 5 వ విడత లో 433 మంది లబ్ధిదారులకు రూ.3.16 కోట్ల లబ్ధి కలగడం జరిగిందని,జిల్లాలో 5 విడతలలో కలిపి మొత్తం 2035 మంది లబ్ధిదారులకు రూ.16.86 కోట్లు వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేసి ఆ కుటుంబాలలో ఆనందం నింపరని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్, యం.పి,ఎమ్మెల్సీ, మేయర్ 433 మందికి గాను రూ.3.61 కోట్ల మోగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పి డి.జ్యోతి,సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
1. కళ్యాణమస్తు లబ్ది పొందడం చాలా సంతోషంగా ఉంది.
యం .భార్గవి,
ఏర్పడు మండలం, తిరుపతి జిల్లా, వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా లబ్దిపొందిన భార్గవి మాట్లాడుతూ
మాది ఎస్సీ కులం, మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొందడం ఆనందంగా ఉందని, పేద కుటుంబంలోని ఆడపిల్లలకు వైయస్సార్ కళ్యాణమస్తు,వైయస్సార్ సాధితోఫా ద్వారా పెండ్లి ఖర్చులకు ఆర్థిక సహాయం అందించి మా తల్లిదండ్రులకు భరోసాని ఇచ్చారని. అదేవిధంగా మీరు పెట్టే అనేక పథకాల వల్ల నిరుపేదలైన కుటుంబాలు చాలా సంతోషంగా జీవిస్తున్నారని. జగనన్న, మా కుటుంబానికి అమ్మబడి, రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, చేయూత,మా నానమ్మకు పెన్షన్ వస్తుందని, గతంలో అయితే రేషన్ తీసుకోవడానికి పక్క గ్రామాలకు వెళ్లేవారుమని ఇప్పుడు ఏలాంటి ఇబ్బందులు లేకుండా మా ఇంటి దగ్గరికి వాహనాన్ని పంపించడంతో చాలా సంతోషంగా ఉందని, అదే విధంగా నాడు నేడు పథకం ద్వారా ప్రైవేటు పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం పెట్టి పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు బుక్స్ యూనిఫారం అందజేయడం పేదవారిపై మీరు చూపిస్తున్న అభిమానానికి పేద ప్రజలందరూ మీకు అండగా ఉంటామని, మళ్ళీ మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను, ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపింది.