-అన్ని నియోజకవర్గంలో స్ట్రాంగ్ రూమ్ లు సిద్ధంగా ఉన్నాయి: జిల్లా కలెక్టర్ డా జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిశ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హల్ నందు క్లెయిమ్స్, అండ్ అబ్జెక్షన్స్, అనోమాలిస్, అలాట్మెంట్ ఆఫ్ కామన్ సింబల్స్ పై గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో విద్యుత్, త్రాగునీరు, ఫర్నీచర్ మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. 2023 ఏప్రిల్ 15 నుండి 2024 జనవరి 22 నాటికి 6,7 & 8 పార్మ్స్ 14,243 పెండింగ్ ఉన్నాయని తెలిపారు. అందులో ఫారం 6 కు సంబంధించి 6642, ఫారం 6 ఏ – 20, ఫారం 7 – 4648, ఫారం 8 – 2933 పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరం చేయడం జరుగుతుందన్నారు. ఫారం 9,10,11 కు సంబంధించి టెక్నీకల్ సమస్య ఉందని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల లో పార్టీల తరపున మంచి ఏజెంట్లును నియమించుకొని వారికి సంబంధించి జాబితాను రెడీగా ఉంచుకోవలని వారికి జిల్లా ఎన్నికల అధికారి నుండి గుర్తింపు కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని, ఏజెంట్లు కు శిక్షణ ఇచ్చుకోవలని రాజకీయ పార్టీ నాయకులు సూచించారు. నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, సమస్య ఉన్న పోలింగ్ కేంద్రాల పై ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఈ ఆర్ ఓ లు కోదండ రామిరెడ్డి, చంద్రముని, అతిది సింగ్, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.