Breaking News

ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ తిరుపతి , ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ ప్రారంభించడం శుభ పరిణామం

-జిల్లా కలెక్టర్ డాక్టర్.జి.లక్ష్మిశ.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ తిరుపతి , ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ ప్రారంభించడం శుభ పరిణామం అని జిల్లా కలెక్టర్ డా.జి లక్ష్మి శ అన్నారు. మంగళవారం ఏర్పేడు మండలంలోని ఐసెర్ సంస్థ నందు వర్చువల్ ద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్ గా ఐసర్ తిరుపతి , ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ ప్రారంభించడం శుభ పరిణామం. రాష్ట్ర విభజన తర్వాత అత్యున్నత విద్యా సంస్థలు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతిక భవనాలు నిర్మాణం చేసుకున్నాయి. ప్రధాని చేతుల మీదుగా మన తిరుపతి జిల్లా లో ఒకే సారి మూడు చోట్ల ప్రారంభోత్సవం జరగడం రాష్ట్రానికే గర్వ కారణం. మరిన్ని అద్భుత పలితాలు, అద్భుతమైన ప్రగతి సాధించాలి, దేశం గర్వించే విధంగా ఖ్యాతి ఆర్జించాలన్నారు.

దేశ భవిష్యత్తు నిర్మాతలుగా యువత ముందుకు వెళ్లాలని అన్నారు. విద్యార్థుల జ్ఞానం మరియు అభిరుచితో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు యువత ముందుకు రావాలన్నారు. విద్యార్థులు విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఐ ఐ ఐసెర్ సంస్థలు దేశానికి రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తుకు ప్రకాశం చేసేలా విజ్ఞాన జ్యోతులుగా ముందుకు వెళ్లాలన్నారు. ఐ ఐ ఐసెర్ సంస్థ తిరుపతి రావడం జాతికి అంకితం చేయడం గర్వకారణంగా ఉందన్నారు, తిరుపతి ఐసెర్ సంస్థ సైన్స్ లో ఒక ప్రత్యేక మైన స్థానం కలిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ యం. గురుమూర్తి, ఐసెర్ సంస్థ డైరెక్టర్ S .భట్టాచార్య, ఐజర్ రిజిస్టర్ ఇంచార్జి విజయ్ మోహన్ పిలై, చీఫ్ ఇంజనేరు CPWD శ్రీధర్ రెడ్డి, అధికారులు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *