-ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి…
-38మంది వాలంటీర్లకు 5లక్షల70వేల వ్యక్తిగత నగదును ప్రోత్సాహంగా ప్రకటించిన ఎమ్మెల్యే నాని..
-ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులు వాలంటీర్లు…
-వానర సైన్యం మాదిరి….రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి…
గుడివాడ రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. గుడివాడ టౌన్ పరిధిలోని510, రూరల్ మండల పరిధిలోని 238మంది వార్డు ,గ్రామ వాలంటీర్లలో ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర… సేవారత్న… సేవావజ్ర పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఒక్కొక్కరికి 15,30,45వేల చొప్పున నగదు ప్రోత్సాహాన్ని ఇస్తూ సత్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ సాంకేతిక కారణాలతో పురస్కారాలకు అర్హత కోల్పోయిన 38 మంది వాలంటీర్లకు ఒక్కొక్కరికి 15 వేల చొప్పున, 5లక్షల70వేల వ్యక్తిగత నగదును ఎమ్మెల్యే కొడాలి నాని ప్రోత్సాహంగా ప్రకటించారు. ప్రజలపై మమకారంతో స్వచ్ఛందంగా గౌరవ వేతనంతో పని చేస్తూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా వాలంటీర్లు అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే నాని కొనియాడారు. ఎటువంటి వివక్షత చూపకుండా ప్రజలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. కుటుంబ సభ్యుడు మాదిరి ప్రజలకు సహాయం చేస్తున్న వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడని ఎమ్మెల్యే నాని అన్నారు.వానర సైన్యాన్ని చూసి లంకాధిపతి రావణుడు ఎలా వణికి పోయాడో….. రాజకీయ రావణాసురుడు చంద్రబాబు అనుకో బ్యాచ్ వాలంటీర్లను చూస్తే అలాగే వణికి పోతున్నారన్నారు. ప్రజలకు అన్యాయం చేసే రాజకీయ రావణాసురుడిని, వానర సైన్యం మాదిరి వాలంటీర్లు తరిమికొట్టాలని కొడాలి నాని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందో, వాలంటీర్లు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీర్లతో అతి త్వరలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తానని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, జడ్పిటిసి గొళ్ళ రామకృష్ణ, గుడివాడ మున్సిపల్ కమిషనర్ బాలసుబ్రమణ్యం, ఎండిఓ జ్యోతి, గుడివాడ పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగు మాల కాళీ, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, వైస్ ఎంపీపీ బట్టు జ్యోతి, పార్టీ నాయకులు రేమల్లి నీలాకాంత్, ఎంవి నారాయణరెడ్డి, వీరిశెట్టి నరసింహారావు, షేక్ సయ్యద్, ఆర్కె, వెంపల అప్పారావు, చుండూరి శేఖర్, వెంపటి సైమన్, డాక్టర్ మలిరెడ్డి రవి, పింకీ, జిల్లా రఘు, అలీ బేగ్, పలువురు ప్రజా ప్రతినిధులు, వాలెంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.