గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నిర్దేశిత నిబందనలు పాటించని మినరల్ వాటర్ ప్లాంట్ లపై ప్రజారోగ్య రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. నగర కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ప్రజారోగ్య అధికారులు నగరంలోని శారదాకాలని, శ్రీనగర్, బొంగరాల బీడు, ఐపిడి కాలని, సంగడి గుంట, నల్లచెరువు మెయిన్ రోడ్ లోని 25 మినరల్ వాటర్ ప్లాంట్ లకు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పలు ప్రాంతాల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా, ప్రజారోగ్యానికి భంగం కల్గించేలా మినరల్ వాటర్ ప్లాంట్ లు నిర్వహిస్తున్నారని రీజినల్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని, ఇప్పటికే సోమవారం 6 ప్లాంట్ లను సీజ్ చేశామని తెలిపారు. ఆయా ప్లాంట్ ల నుండి విక్రయిస్తున్న నీటిలో పిహెచ్ లెవల్స్ నిబందనల మేరకు నిర్వహించడం లేదని, ప్రమాదకర క్లేబిసిల్లా బ్యాక్టీరియాని కూడా గుర్తించినట్లు ల్యాబ్ రిపోర్ట్ అందిందన్నారు. ప్లాంట్ ల నిర్వాహకులు తప్పనిసరిగా నిబందనలు పాటించాలని, లేకుంటే సీజ్ చేయక తప్పదని హెచ్చరించారు. ప్రజలు కూడా నిర్దేశిత ప్రమాణాలు లేని ప్లాంట్ ల నుండి నీటిని కొనుగోలు చేయవద్దని కోరారు. వార్డ్ సచివాలయాల వారిగా నగరంలోని మినరల్ వాటర్ ప్లాంట్ లకు అనుమతులు, ల్యాబ్ రిపోర్ట్ ల పై ఇవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ ఆషా, ఎంహెచ్ఓ మధుసూదన్, ఎస్ఎస్ రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు అంగడి వెంకటేశ్వర్లు, భవాని బాబు, ఐజాక్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …