-ఓటు బదలీ కోసం ఫారం 8 ద్వారానే దరఖాస్తు తప్పని సరి
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు కలిగి ఉన్న ఓటర్లు వేరే చోట కి తమ ఓటు బదలీ కోసం తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే ధరఖాస్తు చేసుకొవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కె.. మాధవీలత తెలియ చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం లో రాజకీయ పార్టీలతో జిల్లా ఎన్నికల అధికారి , కె ఆర్ ఆర్ సి ఏస్ డీ సీ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు తొలగింపు విధానం లో 0.1 శాతం కంటే ఎక్కువ జరిగిన సందర్భంలో సంభందిత వివరాలూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు నివేదికలు పంపించడం జరుగుతుందని తెలిపారు. రాండమనైజేషన్ కి సంబందించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహిస్తామన్నారు. కొత్త ఓటర్ల నమోదు మాత్రమే ఫారం 6 ద్వారా స్వీకరించడం జరుగు తుంది అని స్పష్టం చేశారు. ఒక చోటు నుండి మరో చోటుకు ఓటరు బదలీ కి తప్పనిసరిగా ఫారం 8 ద్వారా మాత్రమే స్వీకరించడం జరుగుతుందని అన్నారు. తదనుగుణంగా వేరొక చోట ఉన్న ఓటును సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆటోమేటిక్ విధానం లో ఫారం 7 ను అనుసరించి తొలగించనున్నట్లు మాధవీలత తెలియ చేశారు. తద్వారా డూప్లికేట్ ఓటు లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేసుకుని అవకాశం ఉందని అన్నారు.
డిసెంబర్ 10 నుంచి ఫిబ్రవరి 20 వ తేదీ వరకు పరిష్కారం చేసిన వివరాలు రాజకీయ పార్టీల కు అందచేశారు. కొత్తగా ఓటర్ల నమోదు కోసం ఫారం.6 లు 18,843 రాగా 16,875 ఆమోదించడం జరిగిందనీ, 1,968 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.
ఓటర్ల తొలగింపు కోసం ఫారం.7 లు 19,679 రాగా 10,567 ఆమోదించడం జరిగిందనీ, 9,112 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. ఫారం.8 లు 29,014 రాగా 26,894 ఆమోదించడం జరిగిందనీ, 2,120 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కే ఆర్ ఆర్ సి ఎస్ డీ టి, రాజమండ్రీ పార్లమెంట్ ఏ ఆర్ వో కృష్ణ నాయక్, రాజకీయ పార్టిల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇంఛార్జ్ ఎన్. రమేష్( శ్యామ్), బీజేపీ – జిల్లా ప్రధాన కార్యదర్శి పి వి లక్ష్మీ , సీపీఐ ఎమ్ – జిల్లా కమిటీ సభ్యుడు ఎస్ ఎస్ మూర్తి, టిడిపి జోన్ 2 కార్యదర్శి సిహెచ్. శ్రీనివాస రావు, , కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ సిబ్బంది గిరీష్ , సునీల్ తదితరులు పాల్గొన్నారు.