-ఈ నెల 25 ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు.
-మొత్తం 27,961 మంది అభ్యర్థులు.
-పరీక్ష కేంద్రం లోకి సెల్ ఫోన్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మీడియా అనుమతి లేదు.
-31 రూట్లు
-61 పరిక్ష కేంద్రాలు,
-61 మంది లైసెన్ ఆఫీసర్లు
-61 మంది చీప్ సూపర్డెంట్లు
-ఏదైన సమాచారం కోసం 90006 65565 – 96769 28804 సంప్రదించగలరు.
-జిల్లా కలెక్టర్ డాక్టర్. జి.లక్ష్మిశ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 25 న నిర్వహించే గ్రూప్ టు పరీక్షలు ఎలాంటి చిన్న పొర పాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్. జి. లక్ష్మిశ పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం హల్ నందు డిఆర్ఓ. పెంచల కిషోర్,గ్రూప్ 2.పరీక్షల విభాగం అడిషనల్ సెక్రటరీ వెంకటలక్ష్మి ల తో కలిసి ఈనెల 25 న తిరుపతి జిల్లాలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు చీఫ్ సూపర్డెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 25న ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు తిరుపతి జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, కోట, గూడూరు మండల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 61 సెంటర్స్ లో 27,894 మంది గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకోసం 31 మందిని జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగాను,61 మంది తహశీల్దార్ లు, ఎంపీడీఓలను లైజన్ ఆఫీసర్లుగాను, 61 చీప్ సూపర్డెంట్లుగా ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్స్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9:30 గంటలకల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలన్నారు. పరీక్ష సమయం పూర్తి అయిన తర్వాత నే బయటకు పంపించాలన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించబడదని, ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్ లు తీసుకొస్తే పరీక్ష కేంద్రం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో భద్రపరిచే విధంగా ఏర్పాటు చేయాలని సంబందితా కళాశాల ప్రిన్సిపాల్స్ ను ఆదేశించారు. పరీక్ష సమయం లో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని,పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఅర్ ఎస్,మెడికల్ క్విట్ తో పాటు ఒక్క ఏ యన్ యం ఏర్పాటు చేయాలని సంబందితా అధికారులను
ఆదేశించారు.విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు అదనంగా సమయం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో రూట్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, లైజన్ ఆఫీసర్లు, చీప్ సూపర్డెంట్లు తదితరులు పాల్గొన్నారు.