Breaking News

నిరుద్యోగ యువతీ యువకులకు టూరిజం అండ్ హాస్పిటలిటీ సెక్టార్ నందు ఉచిత శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జూ పార్క్ వద్ద ఉన్న భారత పర్యాటక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ నందు ఉచిత శిక్షణ నిర్వహించబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC) మరియు సీడప్ (SEEDAP) వారి ఆధ్వర్యంలో దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(DDUGKY) ద్వారా తిరుపతిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ (SIHMCT & AN) నందు స్కిల్ కాలేజీ స్థాపించబడింది. తిరుపతి స్కిల్ కాలేజీ నందు క్రింద తెలుపబడిన కోర్స్ లు ఉచిత శిక్షణ కల్పించబడును.
1) డెమీ చెఫ్ ద పార్టీ (కిచెన్ సూపర్వైజర్) (4 months)
అర్హత: ఇంటర్మీడియట్/ ఐ టి ఐ పాస్
వయస్సు: 18 – 28 సం//లు
ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి సదుపాయం కలదు. అర్హత సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు “స్కిల్ ఇండియా సర్టిఫికెట్” మరియు ప్రముఖ హోటల్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించబడును.
కావున ఈ నిరుద్యోగ యువతీ యువకులు 01-03-2024 వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోని ఈ సదావకాశాన్ని వినియోగించుకుని తద్వారా ఉపాధి పొందాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా అధికారి ఆర్ లోకనాథం గారు ఒక ప్రకటనలో తెలియజేశారు మరిన్ని వివరాలకు 8143576866, 9100558006, 9701343846 ను సంప్రదించగలరు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
● రిజిస్ట్రేషన్ లింక్: https://rb.gy/0d3wz

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *