తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం దరఖాస్తుల డిస్పోజల్, ఏఎంఎఫ్, పోలింగ్ సిబ్బంది, ఎలెక్షన్ & ఈఆర్ సంబంధిత అధికారుల ఖాళీలు, కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్‌లు, ఫిర్యాదులు & ప్రతికూల వార్తలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్.జి.లక్ష్మిశ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత వారంలో 6,7 & 8 ఫార్మస్ కు సంబంధించి 8534 పరిష్కరించడం జరిగిందని మిగిలినవి కూడా ఈ వారం లో వేగవంతం చేసి పరిష్కరం చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
తిరుపతి పట్టణం లో ఎస్ వి జూనియర్ కళాశాల బాలాజీ కాలనీ, శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం నందు ఓట్లు లెక్కింపు కు సంబంధించి 15 హాల్ ల ను పరిశీలించడం జరిగిందని తెలిపారు. తిరుపతి జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వివిధ దినపత్రిక లలో 164 ప్రతికూల వార్తలకు సంబంధించి ఈ ఆర్ ఓ ల నుండి 66 ప్రతికూల వార్తల కు సంబంధించి పరిశీలించడం జరిగిందని, మిగిలిన 98 ఈ ఆర్ ఓ ల దగ్గర పెండింగులో ఉన్నాయని వాటిని కూడా పరిశీలించడం జరుగుతుందని ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ.పెంచల కిషోర్, ఈ ఆర్ ఓ లు కోదండ రామిరెడ్డి,కిరణ్ కుమార్,చంద్రముని, డిప్యూటీ కలెక్టర్లు మురళి,చంద్రశేఖర్ నాయుడు.ఎలక్షన్స్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.