Breaking News

త్వరలో అందుబాటులోకి రానున్న మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి

-క్షేత్రస్థాయిలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గం మధురానగర్ లో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందిగా కలగకుండా త్వరలో రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి తీసుకొస్తారని అందుకు రైల్వే శాఖ సమన్వయంతో త్వరగా పనులు పూర్తి చేస్తున్నారని, రాకపోకలకు ఎటువంటి ఇబ్బందికి కలకుండా ఈనెల ఆఖరిలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, కనకదుర్గ వారధి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్ గా వెళ్ళే అవకాశం ఈ రోడ్డు ద్వారా కలుగుతుందని, ప్రజల అసౌకర్యాని దూరం చేసేందుకు యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, మధురానగర్ స్థానికుల ఇబ్బందులు దూరం చేసేందుకే రైల్వే అండర్ బ్రిడ్జి ఒక మంచి ప్రాజెక్టు అని, రైల్వే శాఖ సమన్వయంతో విజయవాడ నగరపాలక సంస్థ పనులు త్వరతి గతిన పూర్తి చేస్తుందని అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *