Breaking News

AP TET-2024 పరీక్ష హాల్ టికెట్స్ వివరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
AP TET-2024 పరీక్షకు 2,67,559 అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్స్ 23.02.2024 నుండి APTET WEBSITE https://aptet.apchss.in// నందు పొందగలరు , కావున AP TET-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10:30 నుండి డౌన్లోడ్ చేసుకొని వారి పరీక్షా కేంద్రాలు మరియు ఇతర వివరాలు తెలుసుకోగలరు.
పరీక్షా తేదీ వివరాలు:
PAPER 1A : 27.02.2024 TO 01.03.2024,
PAPER 2A: 02.03.2024 to 04.03.2024 & 06.03.2024,
PAPER 1B : 05.03.2024 (FN),
PAPER 2B : 05.03.2024 (AN).
భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు 20.02.2024 న ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన అభ్యర్థులు అనర్హులు అని స్పష్టం చేసింది. కావున దరఖాస్తు చేసుకున్న B.Ed అభ్యర్థులు చెల్లించిన ఫీజు వారి యొక్క ఆధార్ నంబరుకు అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతాలలో జమచేయబడును .
రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 120 పరీక్షా కేంద్రాలలో APTET 2024 పరీక్షకు గాను అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే అభ్యర్థికి కేటాయించడం జరిగింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులలో 76.5% మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్ని వారికి కేటాయించడం జరిగింది.. పరీక్షా కేంద్రాల గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా తమ జిల్లా విద్యాశాఖధికారి కార్యాలయాన్ని సంప్రదించగలరు. అభ్యర్థుల సౌకర్యార్థం TET మరియు DSC కోసం HELP DESK ఉదయం 8:00 నుండి సాయంత్రం 6:00 వరకు పనిచేస్తుంది. HELP DESKకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ : 95056 19127 , 97056 55349, 81219 47387 , 81250 46997.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *