విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్‌లో గోధుమలు ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలను) ఇ-వేలం ద్వారా అందిస్తోంది. ఈ పథకం కింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇ-వేలం ద్వారా ప్రాసెసర్‌లు/అట్టా చక్కి/ఫ్లోర్ మిల్లర్లకు మాత్రమే గోధుమ ఉత్పత్తులను అందిస్తుంది (వ్యాపారులు / పెద్దమొత్తంలో కొనుగోలుదారులు అనుమతించబడరు). ఒకే ఇ-వేలంలో అన్ని ప్రాంతాలకు కలిపి ఒక అర్హతగల LT కనెక్షన్ ఉన్నబిడ్డర్ కనిష్ట పరిమాణానికి 10 MT వేలం వేయవచ్చు మరియు గరిష్ట బిడ్డింగ్ పరిమాణం 50 MTకి మించకూడదు, HT కనెక్షన్ ఉన్నబిడ్డర్ గరిష్ట బిడ్డింగ్ పరిమాణం 400 MTకి మించకూడదు. విద్యుత్ బిల్లుపై కనెక్షన్ రకాన్ని పేర్కొనకపోతే, 1-75 KVA నుండి మంజూరు లోడ్ ఉన్న విద్యుత్ కనెక్షన్ LT కనెక్షన్‌గా పరిగణించబడుతుంది ఇంకా, కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ 4 LMT (గతంలో కేటాయించిన 2.5 LMTకి అదనంగా 1.5 LMT) గోధుమలను గోధుమపిండిగా మార్చుటకు కిలో గోధుమలను ₹ 17.15/- చెప్పున సెమీ-ప్రభుత్వ మరియు సహకార సంస్థలు, అనగా, కేంద్రీయ భండార్, NCCF మరియు NAFED లకు OMSS (D) కింద కేటాయించుటకు నిర్ణయించారు. ఇలా వచ్చిన గోధుమపిండి MRP ని కిలో ₹ 27.50/- గా నిర్ణయించి “భారత్ బ్రాండ్ “పేరుతోప్రజలకు అందిస్తారు. దీనికి సంబంధించి 10.02.2023న ప్రకటించిన అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు.
పైన పేర్కొన్న వాటితో పాటు, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ప్రజలకు OMSS (D) కింద సెమీ-గవర్నమెంట్ మరియు కోఆపరేటివ్ సంస్థలకు అంటే కేంద్రీయ భండార్, NCCF మరియు NAFEDకి FRK మరియు NON-FRK బియ్యాన్ని @ రూ.18.59/కేజీకి కేటాయించాలని నిర్ణయించింది. భారత్ రైస్ బ్రాండ్ కింద MRP వద్ద రూ. 29/కిలో మించకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి, మొత్తం 7250 MTల NON FRK బియ్యాన్ని భారత్ చావల్ పథకం కింద సెమీ ప్రభుత్వ సంస్థలకు విక్రయించడానికి కేటాయించబడింది.
ఇ-వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్/ జి.ఎస్.టి. / ట్రేడ్ టాక్స్ రిజిస్ట్రేషన్, పాన్ కలిగి ఉండాలి మరియు గోధుమల ఈ-వేలానికి సంబంధించి భారత ప్రభుత్వ డబ్ల్యు.ఎస్.పి. పోర్టల్లో (https://evegolis.nic.in/wsp/login) ప్రస్తుత గోధుమల స్టాక్ హోల్డింగ్ను ప్రకటించాలి. విజయవంతమైన బిడ్డర్ MTF లోని ఆండర్‌టేకింగ్ (అపెండిక్స్ -IV)లో పొందుపరచిన షరతులను వుల్లంగించినట్లైతే, ఆ బిడ్డర్ను ఒక సంవత్సరం పాటు OMSS (D) ఇ-వేలం పాల్గొనకుండా డీబార్ చెయ్యడం జరుగుతుంది. నాలుగు అదనపు పేరాలు అంటే, పేరా 8 నుండి పేరా 11 వరకు ఇటీవలే MTF అండర్‌టేకింగ్ (అనుబంధం-lV)లో చేర్చబడ్డాయి, దీని పట్ల బిడ్డర్లు ప్రత్యేక శ్రద్ధను చూపగలరు. 28.02.2024 న జరగబోయే ఇ-వేలం కోసం, కేంద్ర పాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్ కోసం 10 MTల గోధుమలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో FCI సుమారు 2990 MTల గోధుమలను ఆఫర్ చే స్తోంది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి బిడ్డర్ కొనుగోలు చేసిన గోధుమలను తప్పనిసరిగా గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేయాలి మరియు లిఫ్టింగ్ చివరి తేదీ నుండి 15 రోజులలోపు విక్రయానికి మార్కెట్‌లోనికి విడుదల చేయాలి మరియు ప్రాసెసింగ్ మరియు బహిరంగ మార్కెట్‌లో విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియకు సమర్పించాలి. ఇంకా FCI కొన్ని రాష్ట్రాల్లో బియ్యాన్ని అందిస్తోంది. బియ్యం వ్యాపారులు/బల్క్ కొనుగోలుదారులు/బియ్యం ఉత్పత్తుల తయారీదారులు కనిష్ట పరిమాణానికి 1 MTకి వేలం వేయవచ్చు మరియు ఒక ప్రాంతంలోని బియ్యాన్ని ఒకే ఇ-వేలంలో కలిపి అన్ని డిపోలకు కలిపి ఒక బిడ్డర్‌కు గరిష్ట బిడ్డింగ్ పరిమాణం 2000 MTకి మించకూడదు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …