Breaking News

పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులు నాయకత్వం వహించాలి

-సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య
-ముగిసిన లీడర్ షిప్ విభాగం సదరన్ రీజియన్ లెవెల్ వర్క్ షాప్
-పాల్గొన్న నీపా ఆచార్యులు స్మితా మాలిక్, దక్షిణాది రాష్ట్రాల డైట్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యా పరిపాలనా నిర్వహణ సంస్థ,(NIEPA) న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష, సీమ్యాట్, పాఠశాల నాయకత్వ విభాగం (స్కూల్ లీడర్ షిప్ విభాగం) సంయుక్త ఆధ్వర్యంలో, రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు డైట్ ఆచార్యులతో ఫిబ్రవరి 22 నుండి 24 వరకు మూడు రోజుల సదరన్ రీజనల్ సెమినార్ నిర్వహించారు. ‘దక్షిణాది పాఠశాలల్లో ఉత్తమ నాయకత్వ ధోరణులు’ అంశం పై మూడురోజుల శిక్షణా కార్యక్రమాన్ని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య అధ్యక్షత వహిస్తూ గురువారం ప్రారంభించారు. తెలంగాణ, గోవా, ఢిల్లీ ,కర్ణాటక ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన ఆయా రాష్ట్రాల, పాఠశాల నాయకత్వ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సెమినార్ శనివారంతో ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన విశేషాలివి..
తొలి రెండురోజులు ముఖ్య అతిథిగా హాజరైన ని జాతీయ విద్య పరిపాలన నిర్వహణ సంస్థ (NIEPA) ఆచార్యులు డాక్టర్ చారుస్మిత మాలిక్ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో పాఠశాల నాయకత్వ విభాగాలని అభివృద్ధి చేయాలని, తద్వారా పాఠశాల నాయకత్వం ఆచరణలో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల అభ్యసన ఫలితాలని మెరుగుపరచాలని తెలిపారు. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలలోని పాఠశాలల విభాగాలు సంవత్సరంలో చేపట్టాల్సిన వివిధ నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు ,మాడ్యూళ్ల తయారీ, విద్యా పరిపాలన విధానాలను గురించి చర్చించారు. జాతీయస్థాయిలో NIEPA, NCSL సంస్థలు అమలు చేస్తున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వం విధానాల గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ సీమ్యాట్ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి సీమ్యాట్ డైరెక్టర్ శ్రీ వి.ఎన్.మస్తానయ్య గారు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి. ప్రతాప్ రెడ్డి గారు, శామో జాయింట్ డైరెక్టర్ విజయభాస్కర్ గారు వివరించగా, ఏపీ కార్యక్రమాల అమలు తీరును ఆమె ప్రశంసించారు.
విద్యాలయాలు, విద్యార్థుల అభివృద్ధి కోసం గ్రంథాలయ ప్రాధాన్యతలను జాతీయ పుస్తక విభాగం (నేషనల్ బుక్ ట్రస్ట్) ప్రతినిధి డా. ప్రత్తిపాక మోహన్ తెలియజేశారు. విద్యార్థులలో రచన వ్యాసంగాలపై ఆసక్తిని పెంపొందించడంలో ప్రధానోపాధ్యాయులు పాటించాల్సిన విధివిధానాల గురించి తెలంగాణా ప్రతినిధులు ఉమ, అశోక్ ఆసక్తికరంగా వివరించారు. పిల్లలు రాసిన కథలను పుస్తకాలను ప్రదర్శించారు. గోవా రాష్ట్రంలో చేపడుతున్న పౌష్టిక ఆహార అధ్యయన్, స్వచ్చతా హి కర్తవ్యం వంటి కార్యక్రమాల గురించి ఆ రాష్ట్ర ప్రతినిధులు విశాల్ , సూరజ్ తెలియజేశారు.
విద్యార్థులలో అభ్యసన అనుభవాలు ఫలితాలు పెరగాలంటే వారికి అనుకూలమైనటువంటి అభ్యసన వాతావరణం కలగజేయాలని, బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా అన్ని చోట్ల ‘ఫిర్యాదు బాక్సులు’ పూర్తిస్థాయిలో పనిచేసేలా ఉండాలని, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై ఉపాధ్యాయులు తరచుగా తరగతి గదిలో చర్చించి వారిలో ధైర్యాన్ని పెంపొందించాలని‌ డైట్ ఉపాధ్యాయులు రాజు, హరిణి తెలియజేశారు. పాఠశాల నాయకత్వం ఉత్తమ విద్యా పరిపాలన విధానం గురించి వివిధ జిల్లాలకు చెందిన ప్రధానోపాధ్యాయులు వారి వారి పాఠశాలలో జరుగుతున్న ఉత్తమ కార్యక్రమాల గురించి వివరించారు. చివరి రోజు ప్రతినిధులకు సీమ్యాట్ డైరెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా సీమ్యాట్ రూపొందించిన ‘స్మృతిక’ సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమ నోడల్ ఆఫీసర్ డా. ఎ.సుహాసిని, డా. ఎస్. ప్రసాద్, డా. శారదా, అపర్ణ, మాధవీలత తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *