Breaking News

విద్యార్థులు పుస్తక పఠనం అలవర్చుకోవాలి

-సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య, ఎన్టీఆర్ డీఈవో యు.వి.సుబ్బారావు
-విజయవాడలో జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించి ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు విజ్నాన సంబంధిత పుస్తకాలు కూడా చదవడం వల్ల మేథో సంపత్తి పెరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య అన్నారు. శనివారం విజయవాడ పట్టణంలోని ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్ జీడీఈటీ మున్సిపల్ హైస్కూలుకు పుస్తకాలు బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
‘ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్’ నిర్వహిస్తున్న ‘పుస్తక మిత్ర’ కార్యక్రమంలో భాగంగా దాదాపు 50 వేల రూపాయలు విలువ చేసే వివిధ రంగాలకు చెందిన తెలుగు, ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు, రూ. పది వేలు నగదు బీరువాల కోసం అందజేశారు.
ఈ సందర్భంగా విశిష్ట అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావు గారు మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇష్టంగా ఇంటికి తీసుకెళ్లి చదువుకోవాలని కోరారు. అనంతరం పాఠశాలను, తరగతి గదులను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలు దగ్గరవుతుండటం వల్ల ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ‘ఎన్ఆర్ఐ వాసవీ అసోషియేషన్’ గ్రూప్ డైరెక్టర్ పల్లవిశ్రీరామ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.శ్రీనివాసరావు గారు, వరంగల్ నిట్ విశ్రాంత కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ రామారావు గారు, సౌత్ ఇండియా నయూ తాలీమ్ సభ్యులు సీఏ ప్రసాద్ గారు, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *