-రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ఎండగడుతూ జగ్గూ భాయ్ తిరస్కార పత్రం పేరున శీర్షిక ఆవిష్కరణ
-రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటన
-రానున్న 5సం||లకు MHPS రాష్ట్ర అధ్యక్షులుగా మరల ఫారూఖ్ షిబ్లీ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
-రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యం.హెచ్.పి.యస్. ఏకగ్రీవ తీర్మానం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గద్దెనెక్కడం కోసం రాష్ట్రంలోని యస్సీ, యస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు ప్రతి వర్గాన్ని తప్పుడు హామీలు, వైసిపి ప్రభుత్వ అన్యాయాలను, దౌర్జన్యాలను ప్రశ్నించినవారిపై భౌతిక దాడులకు పాల్పడుతూ సంక్షేమంమాటున రాష్ట్రాన్ని సంక్షోభంలోకి వైసిపి ప్రభుత్వం నెట్టివేసింది. వైసిపి చేపట్టిన ఈ దమనకాండపై రాష్ట్ర వ్యాప్తంగా అనునిత్యం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పోరాటాలను సాగిస్తూ బాధితులకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ప్రధానంగా దుల్హన్ పథకం, విదేశీ విద్య, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాలపై గౌరవ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసి, వీటి విజయంతో జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారాయి. అలాగే కర్నూలు హాజిరా అత్యాచారం, నంద్యాల అబ్దుల్, మిస్బాల ఆత్మహత్యా ఉదంతాల విషయంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పోరాట పటిమ, సమితి సభ్యుల స్పూర్తి మనందరికీ విదితమే. వైసిపి ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో రానున్న ఎన్నికల్లో మళ్ళీ యస్సీ, యస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ప్రతి సామాజిక వర్గాలను మోసం చేసేందుకు సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పోరాటాలను సాగించడానికి, రాష్ట్రంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే సంకల్పంతో రాజకీయ అండగా రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు తెలుగుదేశం పార్టీకి ప్రకటించడాన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సమితి గౌరవ సలహాదారులు నాజర్ బాషా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతం సమితి అధికారిక జెండాను గౌరవ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి ఇంతియాజ్ అహ్మద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో సంక్షేమం మాటున ఏనాడూ జరగని తీవ్ర అన్యాయం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధఃపాతాళానికి వెళ్ళిపోవడం, తీవ్రస్థాయిలో నిరుద్యోగ సమస్యలు, ప్రశ్నించినవారిపై భౌతిక దాడులు ఎక్కువయ్యాయని ధ్వజమెత్తారు. ఈ దాడులను ప్రతిఘటిస్తూ యం.హెచ్.పి.యస్. తమ పోరాటాలను సాగిస్తోంది, అలాగే ప్రభుత్వం ఏదైనా అన్యాయంపై తమ పోరాటాలను సాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేడు తమ ప్రయాణాన్ని ఓ రాజకీయ పార్టీతో కొనసాగించాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సలహా మేరకు రానున్న ఎన్నికల్లో తమ పూర్తి మద్దతును తెలుగుదేశం పార్టీకి తెలుపుతున్నామని ప్రకటించారు. అలాగే సమితి ఐదవ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యవస్థాపకులు ఫారూఖ్ షిబ్లిని అధ్యక్షులుగా కొనసాగిస్తూ సమితి కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా తమ సమ్మతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఫారూఖ్ షిబ్లి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, బిజేపితో గతంలో అధికారికంగా పొత్తులో ఉన్నా కూడా రాష్ట్రంలో ఏనాడు ముస్లిం మైనార్టీలపై ఎటువంటి దాడులు, అసంతృప్తి రాగాలు లేకుండా రాష్ట్రాం సుభిక్షంగా ఉండేది. నేడు ముస్లిం మైనార్టీల పక్షపాతి అంటూనే బిజేపి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే వ్యతిరేక చట్టాలైన NRC, CAA, UCC వంటి నల్ల చట్టాలను పార్లమెంటులో సంపూర్ణ మద్దతు ప్రకటించి తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అనధికార పొత్తును ప్రకటించి ముస్లిం మైనార్టీలను ద్రోహం చేశారు. వైసిపి అధినేత జగన్ ముస్లిం మైనార్టీలను నమ్మించి వారి ఓట్లను గంపగుత్తగా వేయించుకుని యావత్తు ముస్లిం సమాజానికి తీవ్ర అన్యాయం చేయడం జరిగిందని ధ్వజమెత్తారు. అలాగే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సామాజిక వర్గాలపై చేసిన దాడులు, అబద్దపు హామీలతో రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాలతోపాటు రాష్ట్రంలోని ప్రతి సామాజిక వర్గాలను చేసిన అన్యాయాలను ఎండగడుతూ జగ్గూ భాయ్ తిరస్కార పత్రం పేరున ఓ శీర్షికను విడుదల చేసి, ఈ శీర్షిక రాష్ట్రంలోని ప్రతి గడపకూ చేరే విధంగా కార్యాచరణ చేపట్టారు. ప్రతి వర్గానికి సామాజిక సేవ, సామాజిక సాధికారత సాధించడానికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగిందని, రేపటి రోజున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రాజకీయ ఎదుగుదలకు, సామాజిక అభివృద్దికి టిడిపి దోహదపడుతుందని అభిప్రాయ పడ్డారు. అలాకాకుండా మైనారిటీలను అన్యాయం చేసే ఏ ప్రభుత్వమైనా తిరస్కరణకు గురవుతాయని సమితి సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి, గౌరవ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి ఇంతియాజ్ అహ్మద్, సమితి రాష్ట్ర సభ్యులు మౌలానా హుస్సేన్ అహ్మద్, సలీం పాషా, అబ్ధుస్ సలీం, నజీర్ అహ్మద్, అబ్దుల్ రజాక్, నాజర్ బాషా, సగీర్, అన్వర్, మహిళా విభాగం నాయకులు షబానా, మెహపారాలతో పాటు భారీ ఎత్తున రాష్ట్ర సభ్యులు పాల్గొన్నారు.