Breaking News

జిల్లా ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం క్రిటికల్ కేర్ వైద్య సేవలు

-రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
– రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా అత్యాధునికమైన అత్యవసర వైద్య విభాగం
– కలెక్టర్ డా. కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 50 పడకల క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్ (CCB) నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం లో భాగంగా రాజ్ కోట నుంచి వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేశారని జిల్లా కలెక్టర్ డా కే.. మాధవీలత పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల లో జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.23.75 కోట్ల అంచనా వ్యయంతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్‌ను భారత ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంటు వ్యాధులు మరియు క్లిష్ట వ్యాధులతో బాధపడుతున్న రోగులకు హామీ ఇవ్వబడిన చికిత్స , వైద్య సేవల నిర్వహణ కోసం ప్రభుత్వ వైద్య కళాశాల లో ఏర్పాటు చేస్తున్న క్రిటికల్ కేర్ బ్లాక్ ద్వారా వైద్య సేవల సామర్థ్యాన్ని పెంపొందించడం జరుగుతుందనీ అన్నారు. ప్రాధమిక, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ద్వారా ప్రజలకి వైద్య సేవలు అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. కొత్తగా జిల్లా ఏర్పాటు చేసిన తరువాత రాజమహేంద్రవరం లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరింత మెరుగైన వైద్యసేవలు రానున్న రోజుల్లో ఇక్కడి వైద్య కళాశాల అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అందుబాటులో రానున్నట్లు తెలిపారు. క్రిటికల్ కేర్ సర్వీసెస్‌లో ఎమర్జెన్సీ, సర్జికల్ మరియు ఇంటెన్సివ్ కేర్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకి మరింత మెరుగైన వైద్య చికిత్స లు అందించే క్రమంలో క్రిటికల్ కేర్ సేవలు వలన జిల్లా ప్రజలకి వైద్య సేవలు పరంగా భరోసాగా నిలుస్తుందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా బి.. సౌభాగ్యా లక్ష్మీ వివరాలు తెలియ చేస్తూ , క్రిటికల్ కేర్ బ్లాక్ (CCB) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 35000 చదరపు అడుగుల అంతర్నిర్మిత విస్తీర్ణంలో ఉన్న G-3 బిల్డింగ్‌ను నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పన కోసం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం కొత్తగా జన్మించిన పిల్లల సంరక్షణ కోసం రెండు (LDR) లేబర్, డెలివరీ , రికవరీ గదులు, రెండూ మీన్ కార్పస్కులర్ హిమోగ్లోబిన్ (MCH) గదులు, అత్యవసర వార్డు – 5 పడకలు (2 ఎరుపు + 2 పసుపు + 1 చికిత్స) , ఎక్స్-రే గది, అల్ట్రాసౌండ్ గది పాయింట్ ఆఫ్ కేర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరుగుతోందనీ అన్నారు. మొదటి అంతస్తు: ఐసోలేషన్ వార్డులు – 24 పడకలు , ఐసోలేషన్ రూమ్ – 2 , కౌన్సెలింగ్ గది , AHU ఎయిర్ గది, వైద్యులు మరియు నర్స్ స్టేషన్, రెండవ అంతస్తు లో రెండు డయాలసిస్ యూనిట్స్ , HDU వార్డ్-6 పడకలు (2 పీడియాట్రిక్ బెడ్‌లతో సహా) , 10 ఐ సి యూ పడకలు (2 పీడియాట్రిక్ బెడ్‌లతో సహా), మూడవ అంతస్తు లో రెండు ఆపరేషన్ థియేటర్లు , ప్రీ ఓ పి & పోస్ట్ ఓ పిన్, అనస్థీషియా గది అందుబాటులో రానున్నట్లు తెలిపారు. జీ జి హెచ్ సూపరింటెండెంట్ డా కే. లక్ష్మి సూర్య ప్రభ మాట్లాడుతూ, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం కి రానున్న రోజుల్లో వైద్య సేవల పరంగా క్రియాత్మకంగా విలీనం చేయబడు తుందన్నారు. COVID-19 తరహా ప్రతికూల వ్యాధుల వ్యాప్తి సమయంలో ఇన్ఫెక్షన్ నివారణ పద్ధతులకు కట్టుబడి ఉండేలా బ్లాక్‌ను ప్రధాన భవనం నుండి వేరు చేయవచ్చునని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, జిల్లా వైద్య ఆరోగ్య అదికారి డా కె. వేంకటేశ్వర రావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా బి. సౌభాగ్య లక్ష్మి, జిజిహెచ్ సూపరింటెడెంట్ డా కే. లక్ష్మి సూర్య ప్రభ, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *