రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరీ జిల్లాలో రబీ-2021-22 మరియు ఖరీఫ్-2022 యొక్క సున్న వడ్డీ పంట రుణాలు క్లెయిమ్‌ల లబ్దిదార రైతుల ఖాతాలో జమ చెయ్యడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ డా కే..మాధవీలత మంగళవారం ప్రకటనలో తెలియ చేశారు.
2021-22 రబీ కి చెందిన 17,409 మంది రైతులకు రూ.3,40,08,955 లు, 2022 ఖరీఫ్ సీజన్ కి సంబంధించిన 13,305 మంది రైతులకు రూ.2,45,61,019 లు వెరసి 30,714 మంది రైతుల ఖాతాలకు రూ.5,85,69,974 లను జమ చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు నియోజక వర్గాల వారీగా లబ్దిదార రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్న వివరాలు తెలియ చెయ్యడం జరిగింది….
అనపర్తి – 4431 మంది రైతులకు రూ.74,22,319 ;
రాజమండ్రీ రూరల్ – 858 మంది రైతులకి రూ.14,07,455 ;
రాజమండ్రీ అర్బన్ 1 రైతుకి రూ.2,975 ;
రాజానగరం – 6,341 మంది రైతులకు రూ.1,15,75,279 ;
గోపాలపురం – 4535 మంది రైతులకు రూ.1,08,04,814 ;
జగ్గంపేట – గోకవరం 921 మంది రైతులకు రూ.15,88,070 ;
కొవ్వూరు – 6462 మంది రైతులకు రూ.1,35,36,801 ;
నిడదవోలు – 7145 మంది రైతులకు రూ.1,21,82,261 ;